2013 ఇండికా ఈవి2ను విడుదల చేసిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా ఈవి2 హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ రిఫ్రెష్డ్ వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. స్టయిలిష్ లుక్, ప్రీమియం ఇంటీరియర్ ఫీల్‌ను తలపించేలా అప్‌గ్రేడ్ చేసి 2013 'టాటా ఇండికా ఈవి2' హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ ఇటీవలే ఆవిష్కరించింది. ఈ కొత్త ఇండికాలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మరియు మెకానికల్ మార్పులు ఉన్నాయి.

కొత్త 2013 టాటా ఇండికా ఈవి2 రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ (బిఎస్3, బిఎస్4 మార్కెట్ల కోసం)తో లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన శక్తివంతమైన కామర్ రెయిల్ సిఆర్4 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 70 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే బిఎస్3 ఇంజన్ గరిష్టంగా 48.9 పిఎస్‌ల శక్తిని, 85 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్మూత్ గేర్ షిఫ్టింగ్‌ కోసం ఇందులో స్మార్ట్-షిఫ్ట్ గేర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వలన గేర్లను సులువుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, దీని వలన ఇది మెరుగైన మైలేజ్ (25 కెఎమ్‌పిఎల్)ను కూడా ఆఫర్ చేస్తుంది. కంఫర్టబల్ రైడ్ కోసం ఇందులో కొత్త డ్యూయెల్ పాత్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ఈ సస్పెన్షన్ ఫలితంగా ఇది అన్ని రకాల రోడ్లపై మంచి హ్యాండ్లింగ్, డ్రైవబిలిటీని అందిస్తుంది.

2013 టాటా ఇండికా ఈవి2

స్టయిలిష్ లుక్, ప్రీమియం ఇంటీరియర్ ఫీల్‌ను తలపించేలా అప్‌గ్రేడ్ చేసి 2013 'టాటా ఇండికా ఈవి2' హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ ఇటీవలే ఆవిష్కరించింది.

2013 టాటా ఇండికా ఈవి2

ఈ కొత్త ఇండికాలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మరియు మెకానికల్ మార్పులు ఉన్నాయి.

2013 టాటా ఇండికా ఈవి2

ఇందులో ఉపయోగించిన శక్తివంతమైన కామర్ రెయిల్ సిఆర్4 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 70 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే బిఎస్3 ఇంజన్ గరిష్టంగా 48.9 పిఎస్‌ల శక్తిని, 85 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2013 టాటా ఇండికా ఈవి2

స్మూత్ గేర్ షిఫ్టింగ్‌ కోసం ఇందులో స్మార్ట్-షిఫ్ట్ గేర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వలన గేర్లను సులువుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, దీని వలన ఇది మెరుగైన మైలేజ్ (25 కెఎమ్‌పిఎల్)ను కూడా ఆఫర్ చేస్తుంది.

2013 టాటా ఇండికా ఈవి2

కంఫర్టబల్ రైడ్ కోసం ఇందులో కొత్త డ్యూయెల్ పాత్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ఈ సస్పెన్షన్ ఫలితంగా ఇది అన్ని రకాల రోడ్లపై మంచి హ్యాండ్లింగ్, డ్రైవబిలిటీని అందిస్తుంది.

2013 టాటా ఇండికా ఈవి2

ఎబోనీ బ్లాక్ అండ్ సహారా బీజ్ ఇంటీరియర్స్

2013 టాటా ఇండికా ఈవి2

బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పవర్‌ఫుల్ మ్యూజిక్ సిస్టమ్

2013 టాటా ఇండికా ఈవి2

ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్

2013 టాటా ఇండికా ఈవి2

కొత్త ఫ్యాబ్రిక్ సీట్స్

2013 టాటా ఇండికా ఈవి2

క్రంపల్ జోన్స్, సైడ్ ఇన్‌ట్రుషన్ బీమ్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ ల్యాంప్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారు సొంతం.


ఎబోనీ బ్లాక్ అండ్ సహారా బీజ్ ఇంటీరియర్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పవర్‌ఫుల్ మ్యూజిక్ సిస్టమ్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, సైడ్ బ్లింకర్లతో కూడిన ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, అన్ని పవర్ విండోస్, కొత్త ఫ్యాబ్రిక్ సీట్స్, మ్యాగజైన్ పాకెట్స్, బాటిల్ హోల్డర్స్ వంటి ఇంటీరియర్ ఫీచర్లను ఈ కొత్త 2013 టాటా ఇండికా ఈవి2 హ్యాచ్‌బ్యాక్‌లో గమనించవచ్చు.

క్రంపల్ జోన్స్, సైడ్ ఇన్‌ట్రుషన్ బీమ్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ ల్యాంప్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారు సొంతం. ఇది మింట్ వైట్, జెట్ సిల్వర్, సీ బ్లూ మరియు కొత్తగా పరిచయం చేసిన స్పానిషన్ టాన్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభ్యమవుతుంది. ఇండికా రేంజ్ ధరలు రూ.3.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ఇది 2 ఏళ్లు లేదా 75,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 24, 2013, 16:13 [IST]
English summary
New 2013 Tata Indica comes with luxurious dual tone interiors, new transmission, new improved duel path suspension and striking new exteriors, which delivers a whole new experience. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+