2013 నానో సిఎన్‌జిని ఆవిష్కరించిన టాటా మోటార్స్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'లో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న సిఎన్‌జి వెర్షన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. టాటా మోటార్స్ విడుదల రిఫ్రెష్డ్ వెర్షన్ 2013 టాటా నానో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త సిఎన్‌జి వేరియంట్ నానోను కంపెనీ అభివృద్ధి చేసింది. 'టాటా నానో ఈమ్యాక్స్' (Tata Nano emax) అనే పేరుతో కంపెనీ ఈ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.
అప్‌గ్రేడెడ్ 2013 టాటా నానోకి సిఎన్‌జి వెర్షన్ టాటా నానోకి డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు లేవు. కొత్త నానోలో బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ ఉండగా, సిఎన్‌జి నానోలో బీజ్ కల్ ఇంటీరియర్స్‌ను జోడించారు. ఇందులో కారు వెనుక వైపు ఈమ్యాక్స్ అనే బ్యాడ్జ్, స్పీడోమీటర్ చుట్టూ గ్రీన్ కలర్ రింగ్, సిఎన్‌జి ఫ్యూయెల్ సప్లయ్ కోసం ఆన్/ఆఫ్ స్విచ్, కొత్త బాడీగ్రాఫిక్స్‌ను గమనించవచ్చు.
టాటా సిఎన్‌జి వేరియంట్లో 32 లీటర్ల ఇంధనం పట్టే ట్యాంక్‌ను అమర్చారు. ఇది కిలోకు 36 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. రానున్న నెలల్లోనే ఇది మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. కొత్త నానోలో లభించే అన్ని ఫీచర్లు ఈ సిఎన్‌జి వెర్షన్ నానోలోను లభ్యం కానున్నాయి. కాగా.. 2013 టాటా నానో జులై నాటికి మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల కానుంది.








Click it and Unblock the Notifications








