టాటా మోటార్స్ నుంచి 800సీసీ కారు 'డాల్ఫిన్'

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఓ 800సీసీ ఇంజన్ కలిగిన కారును అభివృద్ధి చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఇయాన్, మారుతి ఆల్టో 800 వంటి మోడళ్లను సవాల్ చేస్తూ, 'టాటా డాల్ఫిన్' అనే పేరిట టాటా మోటార్స్ ఓ చిన్న కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

టాటా నానో (రూ.1.5 లక్షలు)కు టాటా ఇండికా (ధర రూ.3.8 లక్షలు) మధ్య ఉన్న ఖాలీని భర్తీ చేసేలా ఓ ఫ్యామిలీ కార్‌ను టాటా మోటార్స్ ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. బహుశా ఇదే అప్‌గ్రేడెడ్ టాటా నానో అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఆటోమొబైల్ పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదు.

అయితే, ఇటీవలే టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, తమ టాటా నానో కారుకు స్మార్ట్ సిటీ కార్ ఇమేజ్‌ను తీసుకువస్తామని, ఇందులో పవర్ స్టీరింగ్‌తో పాటు మరిన్ని అధనపు హంగులు జోడిస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే.

టాటా డాల్ఫిన్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

విస్టా ప్లాట్‌ఫామ్

విస్టా ప్లాట్‌ఫామ్

టాటా మోటార్స్ నుంచి ఈ చిన్న కారు 'డాల్ఫిన్' లేదా 'ఎక్స్0' (కోడ్‌నేమ్)ను కంపెనీ అందిస్తున్న పాపులర్ విస్టా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేయనున్నారు.

హ్యాచ్‌బ్యాక్

హ్యాచ్‌బ్యాక్

టాటా మోటార్స్ నుంచి రానున్న ఈ డాల్ఫిన్ కారు హ్యాచ్‌బ్యాక్ రూపంలో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. తొలుతగా ఇది పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇందులో డీజిల్ వెర్షన్‌ను విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇంజన్

ఇంజన్

ప్రత్యేకించి సిటీ రైడ్ కోసం, ఆధునిక యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేస్తున్న టాటా డాల్ఫిన్ కారులో 800సీసీ ఇంజన్‌ను అమర్చనున్నట్లు తెలుస్తోంది. టాటా నానో మాదిరిగా కాకుండా, డాల్ఫిన్ కారులో ఇంజన్‌ను ముందువైపు ఉంచనున్నారు.

కంఫర్ట్ ఫీచర్లు

కంఫర్ట్ ఫీచర్లు

టాటా నుంచి రానున్న ఈ కాంపాక్ట్ కారులో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అడ్జస్టబల్ స్టీరింగ్ వంటి కంఫర్ట్ ఫీచర్లు లభ్యం కానున్నట్లు సమాచారం.

సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్లు

సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్లు

ఈ చిన్న కారులో ఏబిఎస్, ఈబిడి, ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-థెఫ్ట్ అలారమ్, చైల్డ్ లాక్ రియర్ డోర్, ఫాగ్ ల్యాంప్స్ వంటి సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లతో కూడా లభ్యం కానున్నట్లు సమాచారం.

అంచనా ధర

అంచనా ధర

దేశీయ విపణిలో ఈ చిన్న కారు ధర రూ.2-3 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Saturday, August 31, 2013, 14:24 [IST]
English summary
Tata Motors is working on a hatchback that will sit between the Nano and the Indica in terms of price and positioning. Speculation floating on the internet for almost a year now suggests the car maker might be working on what is being called 'Tata Dolphin'.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+