టాటా మోటార్స్ నుంచి మరో చిన్న కారు, కోడ్ నేమ్: కైట్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ టాటా నానో కారుకు ఎగువన ఓ చిన్న కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ కార్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, తాము కూడా ఓ నాణ్యమైన బడ్జెట్ కారును ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మేరకు టాటా మోటార్స్ ఇప్పటికే 'కైట్' (KITE) అనే కోడ్ నేమ్‌తో ఓ కాంపాక్ట్ కారును అభివృద్ధి చేస్తోంది.

ప్రస్తుతం బడ్జెట్ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో మారుతి సుజుకి సెలెరియో వంటి మోడళ్లు మార్కెట్‌ను డామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఈ విభాగంలో ఉత్పత్తులను అందించాలని భావిస్తోంది. టాటా మోటార్స్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ఉంది. ఈ నేపథ్యంలో, టాటా ప్రవేశపెట్టబోయే తమ చిన్న కారు మారుతి ఆల్టోలా సక్సెస్ సాధించే అవకాశం ఉంది.

Tata Motors Working On Small Car Called KITE

టాటా మోటార్స్ అభివృద్ధి చిన్న కారు కైట్‌ను ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న టాటా నానో మరియు త్వరలో విడుదల చేయనున్న టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌లకు మధ్యలో ప్రవేశపెట్టనున్నారు. గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన నెక్సన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని కంపెనీ తమ కైట్ కాంపాక్ట్ కారును అభివృద్ధి చేస్తున్నట్లు విస్వసనీయ వర్గాల సమాచారం.

టాటా మోటార్స్ తమ కైట్ కారును గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో (టాటా నానో మాత్రమే తయారవుతున్న ప్లాంట్‌లో) ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 2.50 లక్షల యూనిట్లు. ఇందులో 1.50 లక్షల యూనిట్లను కైట్‌కే కేటాయించే అవకాశం ఉంది. టాటా కైట్ తయారీలో నానో డిజైన్ లాంగ్వేజ్‌ని ఉపయోగించవచ్చని తెలుస్తోంది.

టాటా కైట్ స్మాల్ కార్ 2015లో అందుబాటులోకి రానుంది. కైట్ రాకతో టాటా మోటార్స్ మరోసారి గాలిపటంలా మరింత పైకెగిరి, ప్యాసింజర్ కార్ విభాగంలో మంచి వృద్ధి సాధించవచ్చని నిపణులు భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 10, 2014, 11:20 [IST]
English summary
Tata Motors has noticed the increase in popularity in small cars and is keen to introduce a new product in the market. They have given it the code name KITE.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+