టాటా మోవస్ ఎమ్‌పివి విడుదల; ధర రూ.6.99 లక్షలు
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ సరికొత్త ఎంట్రీ-లెవెల్ మల్టీ పర్పస్ వెహికల్ (ఎమ్‌పివి) 'టాటా మోవస్'ను మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.6.99 లక్షల (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త ఎమ్‌పివి కేవలం రెండు వేరియంట్లలో (సిఎక్స్, ఎల్ఎక్స్) మాత్రమే లభ్యమవుతుంది.
గతంలో టాటా మోటార్స్ విక్రయించిన టాటా గ్రాండేకు అప్‌గ్రేడెడ్ వెర్షనే ఈ టాటా మోవస్ ఎమ్‌పివి. ఇధి 7, 8, 9 సీటింగ్ కెపాసిటీలతో లభిస్తుంది. ఇందులో 2.2 లీటర్, 4-సిలిండర్, వారికార్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 హార్స్‌పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టాటా మోవస్ లీటరుకు గరిష్టంగా 15.16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. దీని గ్రౌండ్ క్లచ్ సిస్టమ్‌ను మరింత మెరుగుపరచారు. మోవస్ గ్రౌండ్ క్లియరెన్స్ 180 మి.మీ., దీని టర్నింగ్ రేడియస్ 5.35 మీటర్లు. ఇది టిల్టబల్ పవర్ స్టీరింగ్‌తో లభిస్తుంది. పెద్ద కుటుంబాల కోసం విశాలంగా ఉండటంతో పాటు, సులువైన నిర్వహణ, దగ్గర, దూర ప్రయాణాలకు అనువుగా ఉండేలా టాటా మోవస్‌ను రూపొందించామని కంపెనీ పేర్కొంది.
టాటా మోవస్ ఇటు సిటీ డ్రైవ్‌కు అటు హైవే డ్రైవ్‌కు అనుకూలంగా ఉంటుందని, సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీపడకుండా, అత్యుత్తమ విలువలతో ఈ వాహనాన్ని తయారు చేశామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్) రంజిత్ యాదవ్ తెలిపారు. మెట్రో నగరాలు మరియు కొన్ని ఎంపిక చేసిన నగరాల్లోని అన్ని టాటా డీలర్‌షిప్ కేంద్రాల్లో మోవస్ ఎమ్‌పివి లభిస్తుందని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








