త్వరలో టాటా నానో ఆటోమేటిక్ (ఏఎమ్‌టి) విడుదల

By Ravi

ప్రస్తుతం ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో చవకైన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఇప్పటి మారుతి సుజుకి తమ సెలెరియో కారులో ఏఎమ్‌టి వెర్షన్‌ను ప్రవేశపెట్టి మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసినదే. కాగా, తాజాగా టాటా మోటార్స్ కూడా తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లోను మరియు స్మాల్ కార్ టాటా నానోలోను ఏఎమ్‌టి ఆఫర్ చేయనుంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలోనే ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కూడిన టాటా నానో మార్కెట్లోకి రానుంది. టాటా మోటార్స్ ఇప్పటికే ఈ వెర్షన్‌ను ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. వాస్తవానికి, గడచిన ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2014లో టాటా మోటార్స్ 'టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్' పేరిట ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) వెర్షన్‌ను ప్రదర్శనకు ఉంచింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టాటా నానో ఏఎమ్‌టి వస్తోంది

టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఏఎమ్‌టి వేరియంట్ కూడా కొత్త టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్ మాదిరిగానే సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. బ్లాక్ కలర్ ఎయిర్ డ్యామ్‌తో కూడిన సరికొత్త బంపర్ డిజైన్, రివైజ్ చేయబడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ డిజైన్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

టాటా నానో ఏఎమ్‌టి వస్తోంది

టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఏఎమ్‌టి ఒక క్లచ్ లేని ఆమేటిక్ వేరియంట్. టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ వేరియంట్లో ఉపయోగించే ఏఎమ్‌టి యూనిట్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

టాటా నానో ఏఎమ్‌టి వస్తోంది

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)గా చెప్పుకునే ఈ గేర్‌బాక్స్, మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్‌తో సమానమైన మైలేజీని ఆఫర్ చేస్తూనే, ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌లోని సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అంతేకాదు, దీని ధర సాంప్రదాయ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కన్నా తక్కువగా ఉంటుంది.

టాటా నానో ఏఎమ్‌టి వస్తోంది

నగర ట్రాఫిక్‌లో చికాకు లేకుండా కారును సులువుగా నడిపేందుకు వీలుండేలా ఏఎమ్‌టి టెక్నాలజీతో తయారు చేసిన టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఏఎమ్‌టి వేరియంట్‌ను ఈ పండుగ సీజన్ నాటికి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 7, 2014, 12:25 [IST]
English summary
Tata Motors revealed its plan to launch an AMT version in its most affordable car till date the Nano. The Automated Manual Transmission will be offered in the Twist variant of Nano. The Indian manufacturer has been testing the vehicle rigorously prior to its launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+