టాటా నానో ఈమ్యాక్స్ సిఎన్‌జి విడుదల; ధర, ఫీచర్లు
టాటా నానో సిఎన్‌జి వేరియంట్ విడుదల గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించినట్లుగానే, టాటా మోటార్స్ నేడు (అక్టోబర్ 8, 2013) తమ సరికొత్త 'టాటా నానో ఈమ్యాక్స్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో టాటా మోటార్స్ కొత్త నానో ఈమ్యాక్స్ సిఎన్‌జి వెర్షన్‌ను వాణిజ్య పరంగా విడుదల చేసింది. టాటా నానో ఈమ్యాక్స్ సిఎన్‌జి ఈమ్యాక్స్ రెండు వేరియంట్లలో (సిఎక్స్, ఎల్ఎక్స్) మాత్రమే లభిస్తుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- నానో ఈమ్యాక్స్ సిఎక్స్ - రూ.2.45 లక్షలు
- నానో ఈమ్యాక్స్ ఎల్ఎక్స్ - రూ.2.72 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, అహ్మాదాబాద్)
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

టాటా నానో ఈమ్యాక్స్ సిఎన్‌జి వేరియంట్లో డ్రైవర్ సీటుకు దిగువన రెండు సిఎన్‌జి సిలిండర్లను అమర్చారు. ఇవి నానో రేంజ్‌ను పెంచడానికే కాకుండా, రన్నింగ్ కాస్ట్‌ను తగ్గించేందుకు కూడా సహకరిస్తాయి. సిఎన్‌జి వేరియంట్ నానో రన్నింగ్ కాస్ట్ కిలోమీటరుకు రూ.1.32 పైసలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

సిఎన్‌జి కిట్ చేరికతో టాటా నానో బరువు మరో 100 కేజీలు పెరిగి మొత్తం 735 కేజీలకు (ఎల్ఎక్స్) చేరింది. పెట్రోల్ మోడ్‌లో గరిష్టంగా 37.5 బిహెచ్‌పిల పవర్‌ను ఆఫర్ చేసే ఈ 624సీసీ పెట్రోల్ ఇంజన్, సిఎన్‌జి మోడ్‌లో గరిష్టంగా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 బిహెచ్‌పిల శక్తిని, 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 45 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

నానో ఈమ్యాక్స్ సిఎన్‌జి వేరియంట్ ఇంటీరియర్స్‌ను నావెల్ కలర్ స్కీమ్‌తో తయారు చేశారు. ఇది పెద్ద స్టీరింగ్ వీల్‌ను డ్రైవర్ సీట్ అధిక ఎత్తును (క్రింద అమర్చిన సిఎన్‌జి సిలిండర్ కారణంగా) కలిగి ఉంటుంది. ఇందులో ఫైర్ ఎక్స్టింగ్విషర్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తుండగా, డ్యాష్ బోర్డుపై మొబైల్ చార్జర్‌ను తొలగించి వేశారు.

టాటా నానో సిఎన్‌జి ట్యాంక్‌ను ప్రత్యేకించి ఈ మోడల్ కోసం టాటా మోటార్స్ స్వయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ఇంటెలిజెంట్ యాక్టివ్ సేఫ్టీ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను టాటా మోటార్స్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఫ్యూయెల్ లీక్ అవటాన్ని పర్యవేక్షిస్తుంటుంది.

టాటా నానో ఈమ్యాక్స్ సిజిఎన్‌జి 4 ఏళ్లు / 60,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. కేవలం సిఎన్‌జి పైనే ఇది 150 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. పెట్రోల్ ద్వారా ఇది 375 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. మొత్తమ్మీద 525 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

నానో సిఎన్‌జిలో కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు ఇది సిఎన్‌జి వెర్షన్ అని తెలియజేసేందుకు కారు వెనుక వైపు ఈమ్యాక్స్ అనే బ్యాడ్జ్ ఉంటుంది. ఇంటీరియర్స్‌లో స్పీడోమీటర్ చుట్టూ గ్రీన్ కలర్ రింగ్, సిఎన్‌జి ఫ్యూయెల్ సప్లయ్ కోసం ఆన్/ఆఫ్ స్విచ్ ఉంటాయి.


Click it and Unblock the Notifications








