టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన టాటా నానో సిఎన్‌జి
ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా గిన్నిస్ పుటల్లో స్థానం దక్కించుకున్న 'టాటా నానో'లో విభిన్న ఇంధన ఆప్షన్లను తీసుకువచ్చే అంశపై టాటా మోటార్స్ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, కంపెనీ ఇటీవలే సిఎన్‌జి వెర్షన్ టాటా నానోను ఓ కార్యక్రమంలో ఆవిష్కరించింది. ప్రస్తుతం కంపెనీ ఈ కారును భారత రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. బహుశా ఇది ఫైనల్ టెస్టింగ్ కావచ్చని సమాచారం. మరికొద్ది రోజుల్లోనే నానో సిఎన్‌జి వాణిజ్య పరంగా మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
మా సన్నిహిత ఆటో బ్లాగ్ టాటా నానో సిఎన్‌జి కారు టెస్ట్ చేస్తుండగా, తమ కెమెరాలో బంధించింది. టాటా మోటార్స్ త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్న రిఫ్రెష్డ్ వెర్షన్ 2013 టాటా నానో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త సిఎన్‌జి వేరియంట్ నానోను అభివృద్ధి చేసింది. దీనిని సులువుగా సినిఎన్‌జి వెర్షన్ అని గుర్తించేందుకు గాను ఈ కారుకు 'ఈమ్యాక్స్' (emax) బ్యాడ్జ్‌ను జోడించారు. అప్‌గ్రేడెడ్ 2013 టాటా నానోకి సిఎన్‌జి వెర్షన్ టాటా నానోకి డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు లేవు.
కొత్త నానోలో బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ ఉండగా, సిఎన్‌జి నానోలో బీజ్ కల్ ఇంటీరియర్స్‌ను జోడించారు. ఇందులో కారు వెనుక వైపు ఈమ్యాక్స్ అనే బ్యాడ్జ్, స్పీడోమీటర్ చుట్టూ గ్రీన్ కలర్ రింగ్, సిఎన్‌జి ఫ్యూయెల్ సప్లయ్ కోసం ఆన్/ఆఫ్ స్విచ్, కొత్త బాడీగ్రాఫిక్స్‌ను గమనించవచ్చు. టాటా సిఎన్‌జి వేరియంట్లో 32 లీటర్ల ఇంధనం పట్టే ట్యాంక్‌ను అమర్చారు. ఇది కిలోకు 36 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. లేటసెట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండి.

టాటా నానో ఈమ్యాక్స్ స్పైషాట్

టాటా నానో ఈమ్యాక్స్ సిఎన్‌జి వేరియంట్ - ఫ్రంట్ లుక్

టాటా నానో ఈమ్యాక్స్ ఇంటీరియర్స్

టాటా నానో ఈమ్యాక్స్ ఎక్స్టీరియర్

టాటా నానో సిఎన్‌జి రియర్ లుక్
Spy images source: Anything on Wheels


Click it and Unblock the Notifications








