'ప్రజల కారు' టాటా నానో సురక్షితమైన కారు కాదు!

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ప్రజల కారు 'టాటా నానో'కు ఆది నుంచే ఆటంకాలు ఎదరవుతున్నాయి. సేఫ్టీ విషయంలో గతంలోనే పలు వివాదాల్లో చిక్కుకున్న టాటా నానోకు మరో పెద్ద సమస్య వచ్చి పడింది.

ఇటీవల టాటా నానో కోసం నిర్వహించిన గ్లోబల్ క్రాష్ టెస్టులో ఈ కారు విఫలమైంది (సున్నా స్కోరును దక్కించుకుంది). గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో టాటా నానో ఐదు నక్షత్రాలకు గాను ఒక్క నక్షత్రాన్ని కూడా దక్కించుకోకపోవటం ఈ కారు సేఫ్టీపై అనుమానాలకు తావిస్తోంది.

టాటా నానో కారులో ప్రయాణికులు ఎంత వరకు సురక్షితంగా ఉంటారో తెలిపే గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ ఫలితాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి. చివరి స్లైడ్‌లో క్రాష్ టెస్ట్ వీడియోను వీక్షించడం మర్చిపోకండి..!

టాటా నానో గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ రిజల్ట్స్

గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో మొత్తం ఐదు స్టార్లు ఉంటాయి. సాధారణంగా ఏ కారైనా ఈ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్లకు గాను 5-స్టార్ల రేటింగ్‌ను తెచ్చుకుందంటే అది అన్ని విధాల సురక్షితమైన కారని, అందులో ప్రయాణికులకు పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని అర్థం.

టాటా నానో గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ రిజల్ట్స్

ఈ క్రాష్ టెస్ట్‌ల కోసం దాదాపుగా అన్ని భద్రతా ఫీచర్లు కలిగిన టాప్ ఎండ్ వేరియంట్లనే ఉపయోగిస్తారు. క్రాష్ టెస్ట్ చేసే సమయంలో కారులో మనుషులకు బదులుగా డమ్మీలను ఉంచి, డమ్మీలకు కలిగే ప్రమాదాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేసి, సేఫ్టీ రేటింగ్‌ను ఇస్తుంది. ఇందులో తక్కువ రేటింగ్ వచ్చిన కార్లను భద్రత ఫీచర్ల పరంగా బలహీమైనవిగా పరిగణిస్తారు.

టాటా నానో గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ రిజల్ట్స్

గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ ఫలితాల ప్రకారం, ప్రమాదం జరిగినప్పుడు టాటా నానో కారులోని ప్రయాణీకులకు ఏ మాత్రం సేఫ్టీ లేదని వెల్లడైంది. నానో కారులో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు లేకపోవటం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పువచ్చు.

టాటా నానో గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ రిజల్ట్స్

సాధారణంగా, ఈ క్రాష్ టెస్టుకు ఉపయోగించే కారును ఆటోమేటిక్‌గా నడిచేలా చేసి ఒక నిర్ధిష్ట వేగం వద్ద బలమైన ఇనుప దిమ్మెకు గుద్దుకునేలా చేసి, ఆ తర్వాత కారులో జరిగే పరిణామాలను అంచనా వేస్తారు. ఇందులో ప్రయాణికులకు బదులుగా సున్నితమైన డమ్మీ బొమ్మలను ఉపయోగిస్తారు.

టాటా నానో గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ రిజల్ట్స్

బొమ్మలకు తగిలే దెబ్బలను బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తారు. ఎంత మేర రక్షణ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్‌లు సరైన సమయంలో విచ్చుకున్నాయా లేదా, సేఫ్టీ సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత స్టార్ రేటింగ్‌తో సర్టిఫై చేయటం జరుగుతుంది.

వీడియో

టాటా నానో క్రాష్ టెస్ట్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2014, 18:43 [IST]
English summary
The Tata Nano was designed to get the people of India on the road, but stuttering sales will not be helped by the car's poor performance in crash tests carried out in Germany.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+