టాటా నానో కోసం నాలుగు కొత్త స్టయిలిష్ బాడీ కిట్స్

By Ravi

టాటా నానో కోసం కంపెనీ నాలుగు సరికొత్త బాడీ కిట్లను విడుదల చేసింది. టాటా నానో లుక్ అండ్ ఫీల్‌ను మార్చుకోవాలని ఇష్టపడే వారి కోసం సరికొత్త బాడీ గ్రాఫిక్స్, స్టయిలిష్ బాడీ కిట్లను టాటా మోటార్స్ అందిస్తోంది. ఈ బాడీ కిట్స్ ఎల్ఎక్స్, సిఎక్స్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ బాడీ కిట్లను అమర్చడం వలన డల్‌గా కనిపించే టాటా నానో మరింత స్టయిలిష్‌గా, సన్నింగ్‌గా కనిపిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ బాడీ కిట్ల పేర్లు జెట్, రీమిక్స్, ఆల్ఫా మరియు పీచ్. టాటా నానో కారుకు ఈ బాడీ కిట్లను జోడించుకోవటం వలన కేవలం బయటి (ఎక్స్టీరియర్) లుక్ మాత్రమే మారుతుంది. ఇందులోని ఇంజన్, ఇంటీరియర్స్ మాత్రం యధావిధిగా ఉంటాయి. ఎచుకునే కిట్‌ను టాటా నానో కారుకు ముందు వైపు నిర్ధిష్ట కిట్‌కు సంబంధించిన బ్యాడ్జ్ లభిస్తుంది. ఈ కొత్త బాడీ కిట్లను ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 2012 టాటా నానోకు కూడా జోడించుకోవచ్చు.

మీ వద్ద ఇప్పటికే టాటా నానో కారు ఉంటే, ఆ కారుకు కూడా ఈ బాడీ కిట్లను జోడించుకోవచ్చు. వచ్చే జులై నాటికి టాటా మోటార్స్ విడుదల చేయనున్న 2013 టాటా నానోలో కూడా ఈ బాడీ కిట్స్ లభ్యం కానున్నాయి. మరి ఈ స్టయిలిష్ బాడీ కిట్స్ ప్రత్యేకతలు, వాటి ధరల వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

జెట్ బాడీ కిట్

జెట్ బాడీ కిట్

సిల్వర్ ఫినిష్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, ఎల్ఎక్స్ వేరియంట్ కోసం స్పోర్ట్ బాడీ కిట్ అండ్ సైడ్ స్కర్ట్స్, రేస్ థీమ్డ్ బాడీ డెకాల్స్, సైడ్స్ మరియు బానెట్‌పై బాడీ స్ట్రైప్స్.

ధరలు: నానో ఎల్ఎక్స్ 2013 కోసం రూ.27,000

నానో ఎల్ఎక్స్ 2012 కోసం రూ.28,500

నానో సిఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో సిఎక్స్ 2012 కోసం రూ.16,500

రీమిక్స్ బాడీ కిట్

రీమిక్స్ బాడీ కిట్

సిల్వర్ ఫినిష్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, ఎల్ఎక్స్ వేరియంట్ కోసం స్టయిల్ బాడీ కిట్ అండ్ సైడ్ స్కర్ట్స్, ఎయిర్ ఫ్లో బాడీ డెకాల్స్, సైడ్స్ మరియు బానెట్‌పై బాడీ స్ట్రైప్స్.

ధరలు: నానో ఎల్ఎక్స్ 2013 కోసం రూ.27,000

నానో ఎల్ఎక్స్ 2012 కోసం రూ.28,500

నానో సిఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో సిఎక్స్ 2012 కోసం రూ.16,500

ఆల్ఫా బాడీ కిట్

ఆల్ఫా బాడీ కిట్

బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన రూఫ్ మరియు ఫ్రంట్ ఎయిర్‌ఇన్‌టేక్‌లు, బ్లాక్ అల్లాయ వీల్స్, బోల్డ్ అండ్ డైనమిక్ సైడ్ గ్రాఫిక్స్, బానెట్‌పై బాడీ స్ట్రైప్స్.

ధరలు: నానో ఎల్ఎక్స్ 2013 కోసం రూ.19,000

నానో ఎల్ఎక్స్ 2012 కోసం రూ.20,500

నానో సిఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో సిఎక్స్ 2012 కోసం రూ.16,500

పీచ్ బాడీ కిట్

పీచ్ బాడీ కిట్

బాడీ కలర్‌తో మ్యాచ్ అయ్యే అల్లాయ్ వీల్స్, సైడ్స్ మరియు బానెట్‌పై పింక కలర్ బాడీ గ్రాఫిక్స్.

ధరలు: నానో ఎల్ఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో ఎల్ఎక్స్ 2012 కోసం రూ.16,500

నానో సిఎక్స్ 2013 కోసం రూ.15,000

నానో సిఎక్స్ 2012 కోసం రూ.16,500

More from DriveSpark

Article Published On: Friday, June 21, 2013, 14:31 [IST]
English summary
In a bid to change the Nano's image and make them appeal to a younger crowd Tata Motors has launched four new body kits. Available for LX and CX trims, body kits add a little zing to an otherwise dull looking small car. The body kits are named Jet, Remix, Alpha and Peach. The kits can also be added to the 2012 Nano cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+