టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన 'టాటా నానో ప్లస్'

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారు టాటా నానోను ఎలాగైనా మార్కెట్ చేసుకోవాలని టాటా మోటార్స్ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే, టాటా నానోలో మూడు కొత్త వేరియంట్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మూడు కొత్త వేరియంట్లలో ఇప్పటికే ఒక వేరియంట్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. అదే, టాటా నానో ట్విస్ట్. పవర్ స్టీరింగ్‌తో కూడుకున్న టాటా నానో.

ఇక మిగిలిన రెండు వేరియంట్లలో ఒకటి టాటా నానో ప్లస్, మరొకటి టాటా నానో డీజిల్. వాస్తవానికి ఇందులో టాటా నానో డీజిల్ ముందుగా మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ మాత్రం ప్రస్తుతానికి ఈ వేరియంట్ విడుదల మరికొంత కాలం వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. దీంతో టాటా నానోలో రానున్న రెండవ వేరియంట్ టాటా నానో ప్లస్.

టాటా నానో ప్లస్‌కు సంబంధించి ఇదివరకే ఓ కథనం కూడా ప్రచురించడం జరిగింది. మోడ్రన్ ఫీచర్లు, పఫర్‌ఫుల్ ఇంజన్‌తో ఈ కొత్త టాటా నానోను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి రహస్య చిత్రాలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. టాటా నానో ప్లస్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

టాటా నానో కొత్త వేరియంట్

టాటా నానో ప్లస్ వేరియంట్లో 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. కంపెనీ ఇప్పటికే ఈ వేరియంట్‌ను పూనే-కొల్హాపూర్ ప్రాంతంలోని ఎన్‌హెచ్4 రహదారిపై టెస్టింగ్ చేస్తోంది.

టాటా నానో కొత్త వేరియంట్

టాటా నానో ప్లస్ వేరియంట్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ఇంప్రూవ్డ్ ఎయిర్ కండిషనింగ్, బకెట్ సీట్స్, కొత్త డ్యాష్‌బోర్డ్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ లైట్స్, రివైజ్డ్ హుడ్ స్టయిలింగ్, ఓపనబల్ టెయిల్ వంటి ఆకర్షనీయమైన ఫీచర్లు ఉంటాయని సమాచారం.

టాటా నానో కొత్త వేరియంట్

టాటా నానో ప్లస్‌లో ఉపయోగించనున్న ఈ 1.0 లీటర్ ఇంజన్ మరింత స్మూత్‌గా ఉండి, మరింత వేగంగా యాక్సిలరేట్ అవుతుంది. అంటే, మొత్తమ్మీద ఇది ప్రస్తుత 0.6 లీటర్ టాటా నానో కన్నా మెరుగైన పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయనుందన్నమాట.

టాటా నానో కొత్త వేరియంట్

ఈ కొత్త టాటా నానో ప్లస్ ఫైనల్ ప్రొడక్షన్ వేరియంట్‌ను కంపెనీ వచ్చే నెలలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

టాటా నానో కొత్త వేరియంట్

డీజిల్ వెర్షన్ టాటా నానో గురించి కంపెనీ నోరు విప్పకపోయినప్పటికీ, ఇందులో కంపెనీ తాజాగా అభివృద్ధి చేస్తున్న 800సీసీ కామన్ రెయిల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 40.2 బిహెచ్‌పిల శక్తిని, 70 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. టాటా నానో డీజిల్ లీటరుకు 30 కి.మీ. లకు పైగా మైలేజీని ఇవ్వొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2014, 11:53 [IST]
English summary
After Nano Twist launch, Tata Motors is planing to bring Nano Plus with 1 liter 3 cylinder petrol engine, is the one which was recently spotted on the Pune-Kolhapur stretch of NH4. Tata Nano Plus final production variant is expected to make way at the 2014 Delhi Auto Expo next month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+