టాటా నానో ట్విస్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఎట్టకేలకు టాటా నానోలో పవర్ స్టీరింగ్ ఫీచర్ నిజమైంది. పవర్ స్టీరింగ్ ఫీచర్‍‌తో కూడిన సరికొత్త నానో కారు టాటా మోటార్స్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సిస్టమ్ (ఈపిఏఎస్)తో కూడిన కొత్త స్మార్ట్ సిటీ కారుకు 'టాటా నానో ట్విస్ట్' (Tata Nano Twist) అనే పేరును పెట్టారు.

టాటా నానో ట్విస్ట్‌లో ఉపయోగించిన పవర్ స్టీరింగ్‌ను బోష్ సహకారంతో జర్మన్ సంస్థ జెడ్ఎఫ్ ప్రత్యేకంగా నానో కారు కోసం తయారు చేసింది. ఈ పవర్ స్టీరింగ్‌లో బ్రష్‌లెస్ మోటార్‌ను ఉపయోగించారు, ఇది యాక్టివ్ రిటర్న్ అనే ఫీచర్‌తో లభిస్తుంది. ఈ యాక్టివ్ రిటర్న్ అనే ఫీచర్ వలన కారును టర్న్ చేసిన తర్వాత స్టీరింగ్ ఆటోమేటిక్‌గా సెంటర్ పొజిషన్‌కు వస్తుంది. ఓ ఎంట్రీ లెవల్ కారులో ఈ ఫీచర్‌ను ఆఫర్ చేయటం ఇదే మొట్టమొదటిసారి.

టాటా నానో ట్విస్ట్ ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలకు సంబంధించిన సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఎక్స్టీరియర్స్, ఫీచర్స్

ఎక్స్టీరియర్స్, ఫీచర్స్

నానో ట్విస్ట్‌లో ఫ్రంట్ పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఎక్స్టీరియర్స్‌లో కూడా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవు. అయితే, ఇది కొత్త బాడీ కలర్ (డామ్సన్ పర్పల్)లో లభిస్తుంది.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

కొత్త టాటా నానో ట్విస్ట్‌ ఇంటీరియర్స్‌లో కొద్దిపాటి మార్పులు ఉన్నాయి. ఇందులో ఎల్ఈడి ఫ్యూయెల్ అండ్ టెంపరేచర్ ఇండికేటర్స్, యావరేజ్ ఫ్యూయెల్ ఎకానమీ, డిస్టన్స్ టూ ఎంప్టీ ఇండికేటర్స్ మరియు డిజిటల్ క్లాక్‌తో కూడిన సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను జోడించారు.

వేరియంట్, ధర

వేరియంట్, ధర

కొత్త టాటా నానో ట్విస్ట్ కేవలం ఎక్స్‌టి వేరియంట్లో మాత్రమే లభిస్తుంది (రెగ్యులర్ ఎల్ఎక్స్ వేరియంట్ మాదిరిగానే). భారత మార్కెట్లో దీని ధర రూ.2.36 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. దశల వారీగా ఈ కొత్త వేరియంట్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

కంపారిజన్

కంపారిజన్

పవర్ స్టీరింగ్‌తో కూడిన టాటా నానో ట్విస్ట్ ఎక్స్‌టి వేరియంట్ ధర పవర్ స్టీరింగ్ లేని రెగ్యులర్ టాటా నానో ఎల్ఎక్స్ వేరియంట్ కన్నా రూ.13,000 అధికం. అంటే, పవర్ స్టీరింగ్ కోసం సుమారు 13,000 చెల్లించాలన్నమాట. అయినప్పటికీ, ఈ కొత్త వేరియంట్ ధర సుమారు ఆల్టో 800 ధరతో పోటీ పడుతోంది. ఆల్టో 800 ప్రారంభ ధర రూ.2.45 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

కొత్త టాటా నానో ట్విస్ట్ మొత్తం ఆరు రంగుల్లో లభిస్తుంది. ఇందులో ఒక రంగు మాత్రం పూర్తిగా కొత్తది. అవి - డామ్సన్ పర్పల్ (కొత్త కలర్), పెరల్ వైట్, రాయల్ గోల్డ్, పప్పాయ ఆరెంజ్, మెటోర్ సిల్వర్, డాజల్ బ్లూ. అన్ని ఎక్స్‌టి వేరియంట్లు బీజ్ కలర్ ఇంటిరియర్స్‌తో లభిస్తాయి. డాజల్ బ్లూ కలర్ వెర్షన్ మాత్రం స్పోర్టీ బ్లాక్ ఇంటీరియర్స్‌తో లభిస్తుంది.

టాటా నానో ట్విస్ట్ హైలైట్స్:

టాటా నానో ట్విస్ట్ హైలైట్స్:

* సిటీ ట్రాఫిక్‌లో రిలాక్స్డ్ డ్రైవ్.
* బ్రష్‌లెస్ మోటార్ టెక్నాలజీ, యాక్టివ్ రిటర్న్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్‌ వలన అన్ని రోడ్ స్పీడ్స్ వద్ద సౌకర్యంగా నడపవచ్చు.
* నాలుగు మీటర్ల అతి తక్కువ టర్నింగ్ సర్కిల్ రేడియస్‌తో సులభమైన పార్కింగ్.

స్టన్నింగ్ డిజైన్:

స్టన్నింగ్ డిజైన్:

* సరికొత్త డామ్సన్ పర్పల్ సిగ్నేచర్ కలర్, విలాసవంతమైన బీజ్ ఇంటీరియర్స్, క్రోమ్ గార్నిష్.
* కొత్త గేర్‌షిఫ్ట్ కన్సోల్
* స్పోర్టీ ఇంటీరియర్స్

స్టే కనెక్టెడ్:

స్టే కనెక్టెడ్:

* కొత్త స్టయిలిష్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (ట్రిప్ కంప్యూటర్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో)
* బ్లూటూత్ కనెక్టివిటీ
* సేఫ్టీ అండ్ కంఫర్ట్ కోసం రిమోట్ కీలెస్ ఎంట్రీ

అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్

స్టయిలిష్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్

ఆన్ డిమాండ్ గ్రాఫిక్స్

ఆన్ డిమాండ్ గ్రాఫిక్స్

ఆన్ డిమాండ్ స్పెషల్ బాడీ గ్రాఫిక్స్

ట్విస్ట్ బ్యాడ్జ్

ట్విస్ట్ బ్యాడ్జ్

వెనుక వైపు ట్విస్ట్ బ్యాడ్జింగ్

రియర్ సీట్స్

రియర్ సీట్స్

వెనుక వైపు ప్యాసింజర్ల కోసం సౌకర్యవంతమైన సీటింగ్

బ్లూటూత్ కనెక్టివిటీ

బ్లూటూత్ కనెక్టివిటీ

బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్. మొబైల్ ఫోన్ ద్వారా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు.

లేటెస్ట్ అప్‌డేట్స్

లేటెస్ట్ అప్‌డేట్స్

కొత్త నానో ట్విస్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ మరియు రివ్యూ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

 
Story first published: Monday, January 13, 2014, 16:20 [IST]
English summary
Tata Nano with the long awaited feature of power steering is finally here. Tata Nano Twist, as it is called, is priced at INR 2.36 lakhs (Ex-showroom, Delhi) and comes only in the top end XT variant.
Please Wait while comments are loading...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+