రాష్ట్ర మార్కెట్లో టాటా నానో ట్విస్ట్, విస్టా విఎక్స్ టెక్ విడుదల

By Ravi

ఇటీవల దేశీయ విపణిలో విడుదలైన పవర్ స్టీరింగ్ వెర్షన్ టాటా నానో, కంపెనీ తాజాగా విడుదల చేసిన టాటా విస్టా విఎక్స్ టెక్ మోడళ్లను టాటా మోటార్స్ రాష్ట్ర మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. టాటా నానో ట్విస్ట్‌లో ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సిస్టమ్ (ఈపిఏఎస్)ను జోడించారు. ఈ పవర్ స్టీరింగ్‌ను బోష్ సహకారంతో జర్మన్ సంస్థ జెడ్ఎఫ్ ప్రత్యేకంగా నానో కారు కోసం తయారు చేసింది.

ఈ పవర్ స్టీరింగ్‌లో బ్రష్‌లెస్ మోటార్‌ను ఉపయోగించారు, ఇది యాక్టివ్ రిటర్న్ అనే ఫీచర్‌తో లభిస్తుంది. ఈ యాక్టివ్ రిటర్న్ అనే ఫీచర్ వలన కారును టర్న్ చేసిన తర్వాత స్టీరింగ్ ఆటోమేటిక్‌గా సెంటర్ పొజిషన్‌కు వస్తుంది. ఓ ఎంట్రీ లెవల్ కారులో ఈ ఫీచర్‌ను ఆఫర్ చేయటం ఇదే మొట్టమొదటిసారి. రాష్ట్ర విపణిలో టాటా నానో ట్విస్ట్ ధర రూ.2.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.


ఇక టాటా విస్టా విఎక్స్ టెక్ విషయానికి వస్తే, ఫస్ట్ ఇన్ క్లాస్ హైటెక్ ఫీచర్స్, 75 పిఎస్ ఇంజన్‌తో ఈ అడ్వాన్స్డ్, డైనమిక్ కారును తయారు చేశామని, ఇందులో అధునాతన టెక్నలాజికల్ ఫీచర్లను జోడించామని టాటా మోటార్స్ నేషనల్ సేల్స్ హెడ్ ఆశిష్ ధర్ తెలిపారు. కొత్త 'టాటా విస్టా విఎక్స్ టెక్' కారులో జిపిఎస్ నావిగేషన్‌తో కూడిన మల్టీ మీడియా సిస్టమ్, కొత్త డ్రైవ్ ప్రో కన్సోల్, అడ్వాన్స్డ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కొత్త ఫ్రంట్ డ్యుయో-ఫ్లోట్ సస్పెన్షన్, స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్, బ్లూ-5 టెక్నాలజీ వంటి బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను అందిస్తున్నామని ఆయన వివరించారు.
Tata Vista Tech Hyderabad

కొత్త టాటా విస్టా విఎక్స్ టెక్ టాప్-ఎండ్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లో, 6.5 ఇంచ్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆడియో, వీడియో ప్లేయర్‌గా పనిచేస్తుంది. సిడి, డివిడి, యూఎస్‌బి, బ్లూ-5 (5 విభిన్న మొబైల్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు), ఆక్స్-ఇన్ కనెక్టివిటీలను సోపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఇది జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్‌లా కూడా పనిచేస్తుంది. రాష్ట్ర మార్కెట్లో విస్టా రేంజ్ ధరలు రూ.4.96 లక్షలు (విస్టా ఎల్ఎస్) నుంచి రూ.6.11 లక్షలు (విస్టా విఎక్స్ టెక్) రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

More from DriveSpark

Article Published On: Wednesday, January 22, 2014, 9:30 [IST]
English summary
Tata Motors has launched power steering version Tata Nano Twist and new Vista VX Tech in Hyderabad. Nano Twist is priced at INR 2.46 lakhs and the Vista range starts at Rs.4.96 Lakhs for Vista LS, and goes upto Rs. 6.11 Lakhs for the Vista VX Tech (All Prices Ex-showroom, Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+