టాటా నానో ట్విస్ట్ ఎక్స్ఈ వేరియంట్ విడుదల
టాటా మోటార్స్ అందిస్తున్న 'ప్రజల కారు' టాటా నానోలో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పవర్ స్టీరింగ్ వెర్షన్ టాటా నానో ట్విస్ట్‌లో ఓ బేస్ వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది.
టాటా నానో ట్విస్ట్ ఎక్స్ఈ (Tata Nano Twist XE) పేరుతో వచ్చిన ఈ బేస్ వేరియంట్‌లో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్, ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. దేశీయ విపణిలో ఈ కొత్త వేరియంట్ నానో ధర ఇలా ఉంది.
టాటా నానో ట్విస్ట్ ఎక్స్ఈ - రూ.2.06 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

పవర్ స్టీరింగ్ వెర్షన్ నానో కేవలం రెండు వేరియంట్లలో (ట్విస్ట్ ఎక్స్ఈ , ట్విస్ట్ ఎక్స్‌టి) మాత్రమే లభ్యం కానుంది. త్వరలోనే పవర్ స్టీరింగ్ లేని టాటా నానో వేరియంట్లు మార్కెట్ నుంచి తొలగిపోయే ఆస్కారం ఉంది. ఇంజన్ పరంగా కొత్త నానోలో ఎలాంటి మార్పులు లేవు.
టాటా నానో ట్విస్ట్ ఎక్స్ఈ బేస్ వేరియంట్ డిజైన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇందులో బ్లాక్ కలర్ బంపర్స్ (ఫ్రంట్ అండ్ రియర్) ఉంటాయి, వీల్ క్యాప్స్ ఉండవు. కారు లోపల పెద్ద స్టీరింగ్ వీల్ ఉంటుంది. అలాగే, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.


Click it and Unblock the Notifications








