ఆటో ఎక్స్‌పో 2014: టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

By Ravi

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో హాట్ సెగ్మెంట్‌గా ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించేందుకు దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.

టాటా మోటార్స్ ప్రదర్శించిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ పేరు 'టాటా నెక్సన్' (Tata Nexon). టాటా తమ నెక్స్ట్ జనరేషన్ డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని ఈ కాన్సెప్ట్‌ను తీర్చిదిద్దింది. అత్యంత మోడ్రన్‌గా కనిపిస్తున్న ఈ టాటా నెక్సన్ డిజైన్ ఆధారంగా, భవిష్యత్తులోని టాటా కార్లను కూడా డిజైన్ చేయనున్నారు.

టాటా మోటార్స్‌కు ఇండియా, యూకే మరియు టురిన్ డిజైన్ బృందాలు సంయుక్తంగా ఈ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన బోల్ట్ హ్యాచ్‌బ్యాక్, జెస్ట్ కాంపాక్ట్ సెడాన్లను తయారు చేసిన ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే ఈ సరికొత్త టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను కూడా తయారు చేశారు.

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఖచ్చితంగా 4 మీటర్ల పొడవును కలిగి ఉండి, 1.73 మీటర్ల వెడల్పును, 1.6 మీటర్ల ఎత్తును మరియు 2.45 మీటర్ల వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌లో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పిల శక్తిని, 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ సెమీ-ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ (ఏఎమ్‌టి మాదిరిగానే)తో అనుసంధానం చేయబడనుంది.

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రొడక్షన్ వెర్షన్ టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లను అందుబాటులో ఉంచొచ్చని అంచనా.

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

పెట్రోల్ వెర్షన్ టాటా నెక్సన్ గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది లీటరుకు 17.6 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

రానున్న 24 నెలల్లో టాటా నెక్సన్ కాన్సెప్ట్‌ను ఉత్పత్తి దశకు తీసుకువెళ్తామని కంపెనీ ప్రకటించింది. అంటే, 2016 ఆరంభం నాటికి ఇది రోడ్లపై పరుగులు తీసే ఆస్కారం ఉంది.

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ఎస్‌యూవీలో టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆవిష్కరణ.

టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ఎస్‌యూవీలో టాటా నెక్సన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆవిష్కరణ. టాటా నెక్సన్ రియర్ ప్రొఫైల్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2014, 17:13 [IST]
English summary
Tata Nexon is a concept SUV that was showcased at the Auto Expo 2014. Besides previewing the design for its upcoming compact SUV, the Nexon also showcases Tata's next generation design philosophy that will influence the automaker's future models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+