నేపాల్ మార్కెట్లో కొత్త టాటా సఫారీ స్టోర్మ్ విడుదల
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని పొరుగు దేశమైన నేపాల్ మార్కెట్లో విడుదల చేసింది. నేపాల్ మార్కెట్లో టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.37.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
భారత కరెన్సీతో పోల్చుకుంటే, నేపాల్ కరెన్సీ తక్కువగా ఉండటం మరియు అధిక దిగుమతి సుంఖాల వల్లనే నేపాల్ మార్కెట్లో ధీని ధర అంత అధికంగా ఉంది. పూర్తిగా భారత్‌లో తయారైన సఫారీ స్టోర్మ్‌ను సిబియూ రూట్లో నేపాల్‌కు దిగుమతి చేసుకుని, అక్కడి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

లగ్జరీ, కంఫర్ట్, పవర్, సుప్రీం ఆఫ్-రోడింగ్ పెర్ఫామెన్స్‌ల కలయికతో కొత్త సఫారీ స్టోర్మ్‌ను అభివృద్ధి చేశారు. కొత్త టాటా సఫారీ స్టోర్మ్‌లో అమర్చిన 2.2 లీటర్ వ్యారీకార్, వివిటి (వేరియబల్ టర్బైన్ టెక్నాలజీ)తో కూడిన టర్బోచార్జ్‌డ్ ఇంజన్ గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 15 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

టాటా సఫారీ స్టోర్మ్ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4), టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఫోర్-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 13.2 కి.మీ. మైలేజీని, టూ-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 14 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ సఫారీ స్టోర్మ్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఇది అర్బన్ బ్రాంజ్స సార్డినియా రెడ్, పెరల్ వైట్, పెరల్ షాంపైన్, ఏస్టర్న్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, ఆర్కిటిక్ సిల్వర్ అనే ఏడు ఆకర్షనీమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








