టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ విన్నర్ ఎవరు?

By Ravi

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ భారత్‌కు ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను పరిచయం చేయనున్నట్లు ఇదివరకటి కథనాల్లో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ 'టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్' గడచిన ఆదివారంలో గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)పై జరిగింది.

భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్వహించిన టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో క్యాస్ట్రాల్ వెక్టన్ జట్టుకు చెందిన స్టువర్ట్ ఆలివర్ విజేతగా నిలిచారు. ఈ రేసు కోసం అత్యధికంగా మోడిఫై చేసిన 12 టాటా ప్రైమా 4038.ఎస్ హెవీ ట్రక్కులను ఉపయోగించారు. ఈ ట్రక్కులలో 370 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ ఇంజన్లను అమర్చారు.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు రేసులు ఉంటాయి. అందులో ఒకటి 5 ల్యాప్ స్ప్రింట్ మరొకటి 15 ల్యాప్ మెయిన్ రేస్.

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్

ఈ రెండు రేసులలో సంపాధించిన పాయింట్లను ఆధారంగా చేసుకొని తుది పాయింట్లను లెక్కించడం జరుగుతుంది. ఇలా వచ్చిన పాయింట్లలో అత్యధికంగా సాధించిన డ్రైవర్లను మరియు జట్లను అవార్డుతో సత్కరించడం జరుగుతుంది.

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్

ఇది భారత్‌లోనే మొట్టమొదటి ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ అయినప్పటికీ, దీనిని వీక్షించేందుకు భారీగానే వీక్షకులు తరలి వచ్చారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ రేస్‌ను చూసేందుకు బిఐసికి సుమారు 25,000 మందికి పైగా విచ్చేశారు.

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్

టి1 ప్రైమా రేసింగ్ ట్రక్కులను బ్రిటీష్, యూరోపియన్ ట్రక్ రేసింగ్ సర్క్యూట్లకు చెందిన అనుభవజ్ఞులైన రేసింగ్ డ్రైవర్లు నడిపారు.

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్

కమ్మిన్స్ జట్టుకు చెందిన మ్యాట్ సమ్మర్‌ఫీల్డ్ (3వ స్థానం), క్యాస్ట్రాల్ వెక్టన్ జట్టుకు చెందిన స్టువర్ట్ ఆలివర్ (1వ స్థానం) మరియు టాటా టెక్నాలజీస్ మోటార్‌స్పోర్ట్స్‌కు చెందిన డేవిడ్ జెన్కిన్స్ (2వ స్థానం)లు విజేతలుగా నిలిచారు.

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్

టాటా మోటార్స్ కమర్షియల్ బిజినెస్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ. రవి పిషరోడి మాట్లాడుతూ.. తమ తొలి ట్రక్ రేసింగ్ కార్యక్రమానికి మంచి సానుకూల స్పందన లభించిందని, టాటా ప్రైమా ట్రక్కులు తమ రేసింగ్ సామర్థ్యాలను, నిర్మాణ నాణ్యతను నిరూపించుకున్నాయని, టి1 జట్లు మరియు డ్రైవర్ల ప్రతిభను చూసి తాము సంతోషించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విజేతలకు, స్పాన్సర్లకు మరియు ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు.

టాటా టి1 ప్రైమా ట్రక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్

టాటా టి1 ప్రైమా చాంపియన్‌షిప్ డ్రైవర్లు మరియు జట్ల స్టాండింగ్స్.

More from DriveSpark

Article Published On: Monday, March 24, 2014, 12:56 [IST]
English summary
Tata Motors T1 Prima Championship, India's first ever truck racing, was held at the Buddh International Circuit in Greater Noida on Sunday, March 23rd. The race saw 12 heavily modified Tata Prima 4038.S trucks powered by 370 bhp engines capable of reaching a top speed of 110 km/h hurtle around a specially created 2.1 km section of the F1 circuit.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+