ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన టాటా
గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2012 డెట్రాయిట్ మోటార్ షోలో టాటా మోటార్స్ ఆవిష్కరించిన టాటా ఈమో (Tata eMO) ఎలక్ట్రిక్ కారు గుర్తుందా..? అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ రవాణా కోసం టాటా టెక్నాలజీస్ ఈ ఎలక్ట్రిక్ కారును రూపొందించిన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు ఇదే ఎలక్ట్రిక్ కారు ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ సరికొత్త ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్‌ను రూపొందించింది. ఈ కాన్సెప్ట్ వ్యాన్‌కు 'టాటా ఈమో-సి' అనే పేరును ఖరారు చేశారు.
టాటా ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్‌ను భారత్, ఉత్తర అమెరికా, యూరప్‌కు చెందిన టాటా టెక్నాలజీస్ బృందాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ కారు మాత్రమేనని, భవిష్యత్తులో ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉందని టాటా టెక్నాలజీస్ పేర్కొంది. ఇది వినియోగదారుల డ్రైవింగ్ అవసరాలను బట్టి 50 మైళ్లు, 100 మైళ్లు, 150 మైళ్ల రేంజ్ ఆప్షన్‌తో అందుబాటులోకి రానుంది. మార్కెట్లో దీని ధరలు 15,750 డాలర్ల నుంచి 23,750 డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

టాటా ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్

టాటా ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్

టాటా ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్

టాటా ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్

టాటా ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్

టాటా ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్

టాటా ఈమో-సి ఎలక్ట్రిక్ వ్యాన్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్

టాటా ఈమో ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్
టాటా ఈమో ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇందులో నలుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. ఈ కారును కూడా టాటా గ్రూపుకు చెందిన టాటా టెక్నాలజీస్ సంస్థే అభివృద్ధి చేసింది. విశిష్టమైన ఎలక్ట్రిక్ డ్రైవ్, ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఈమో ఎలక్ట్రిక్ కారు 900 కిలోల బరువును కలిగి ఉంటుంది. దీని ధర 20,000 డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చని అప్పట్లో కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








