టాటా జెస్ట్ విడుదల; ప్రారంభ ధర రూ.4.64 లక్షలు

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ నేడు (ఆగస్ట్ 12, 2014వ తేదీన) తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్' (Tata Zest)ను మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.4.64 లక్షల ప్రారంభ ధరకే (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ ఈ మోడల్‌ను విక్రయిస్తోంది. టాటా జెస్ట్ సెడాన్ మొత్తం 9 వేరియంట్లలో (4 పెట్రోల్, 5 డీజిల్) లభిస్తుంది.జెస్ట్ కారుతో టాటా మోటార్స్ తొలిసారిగా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశించనుంది. ఈ కారును మొట్టమొదటి సారిగా ఈ ఏడాది

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల, ధరలు, ఫీచర్లు

పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో కంప్లీట్ ఆటోమేటిక్ కానీ లేదా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కానీ అందుబాటులో లేదు.

Tata Zest Compact Sedan Launched

కాగా.. డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డీజిల్ వెర్షన్ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. టాటా జెస్ట్ వేరియంట్లు, ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

పెట్రోల్ వెర్షన్ ధరలు:
టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఈ - రూ.4.64 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఎమ్ - రూ.5.25 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఎమ్ఎస్ - రూ.5.43 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్‌టి - రూ.5.99 లక్షలు

డీజిల్ వెర్షన్ ధరలు:
టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్ఈ - రూ.5.64 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్ఎమ్ - రూ.6.27 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్ఎమ్ఎస్ - రూ.6.45 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్‌టి - రూ.6.99 లక్షలు
టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్‌ఎమ్ఏ - రూ.6.99 లక్షలు (ఏఎమ్‌టి)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2014, 14:25 [IST]
English summary
Tata Motors has just launched the Zest compact sedan in India. The new Tata Zest price stars at Rs 4.64 lakh for the base petrol variant and Rs 5.64 lakh for the base diesel variant (both prices ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+