ఆటో ఎక్స్‌పో 2014: టాటా జెస్ట్ ఆవిష్కరణ
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈనెల 3వ తేదీన న్యూఢిల్లీలో ఆవిష్కరించిన తమ కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్' (Tata Zest)ను 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. బోరింగ్ ఇండికా, మాంజా డిజైన్‌లకు స్వస్తి పలుకుతూ, అధునాతన డిజైన్ అండ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ కొత్త టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ టాటా స్టాల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
డిజైనెక్స్ట్, డ్రైవ్‌నెక్స్ట్, కనెక్ట్‌నెక్స్ట్ లతో కూడిన టాటా మోటార్స్ యొక్క 'హారిజానెక్స్ట్' సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కారును తయారు చేశారు. టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను కంపెనీ యొక్క ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. పూనే, యూకే మరియు ఇటలీలోని టాటా మోటార్స్ డిజైన్ స్టూడియోల నుంచి సేకరించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ కారును డిజైన్ చేశారు. ఈ కారులో సరికొత్త ఇంజన్లను కూడా ఉపయోగించారు.
టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కాంపాక్ట్ కార్లపై (4 మీటర్ల కన్నా తక్కువ పొడవు కలిగిన కార్లపై) భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొంది, తద్వారా సరసమైన ధరకే కారును అందించాలనే ఉద్దేశ్యంతో టాటా మోటార్స్ ఈ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది.

టాటా జెస్ట్ ఫ్రంట్ డిజైన్ పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త కల్ ఆప్షన్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

ఈ కారులో లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఎమినిటీస్‌తో అప్‌గ్రేడ్ చేసిన సరికొత్త ఇంటీరియర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

టాటా జెస్ట్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్‌లో, టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన 1.2 లీటర్ రెవోట్రాన్ ఎమ్‌పిఎఫ్ఐ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

అలాగే డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో రెగ్యులర్ 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌కు బదులుగా ఇందులో శక్తివంతమైన 1.5 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇంజన్ పెర్ఫామెన్స్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఈ కారులో ఆఫర్ చేయనున్న కొన్ని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 5 ఇంచ్ టచ్‍స్క్రీన్‌తో కూడిన హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టూ స్పీచ్ సిస్టమ్, ఫోన్ ఆధారిగా నావిగేషన్ సిస్టమ్ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లున్నాయి.


Click it and Unblock the Notifications








