టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌పై 6 ఏళ్ల వారంటీ!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వచ్చే నెలలో తమ సరికొత్త కాంపాక్ట్ సెడాన్ 'జెస్ట్' (Zest)ను మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఈ కాంపాక్ట్ కారుకు సంబంధించిన ఈ గ్రేట్ న్యూస్ లీక్ అయ్యింది. టాటా మోటార్స్ తమ కాంపాక్ట్ సెడాన్ టాటా జెస్ట్‌పై సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా 6 ఏళ్ల వారంటీని ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: టాటా బోల్ట్ ఫీచర్లు
మొదటి మూడేళ్లు స్టాండర్డ్ వారంటీని, ఆ తర్వాత మరో మూడేళ్ల అదనపు వారంటీని ఆఫర్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అదనపు వారంటీకి అయ్యే ఖర్చును టాటా జెస్ట్ బేసిక్ ధరలోనే కలిపే ఆస్కారం ఉంది. వినియోగదారుల సంతృప్తిని మెరుగుపరచే దిశలో భాగంగా టాటా మోటార్స్ ఈ ప్రణాళికపై దృష్టి సారిస్తోంది.

టాటా జెస్ట్ మార్కెట్లో విడుదలైన కొద్ది నెలల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌పై 6 ఏళ్ల వారంటీతో పాటుగా కంపెనీ తమ కస్టమర్ల కోసం ఉచిత 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను కూడా ఆఫర్ చేయనుంది. అయితే, ఈ సర్వీసును ఎంత కాలం ఉచితంగా ఆఫర్ చేస్తారనే విషయం మాత్రం తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: టాటా నెక్స్ట్ జనరేషన్ స్మాల్ కార్ కైట్
ఇకపోతే.. టాటా జెస్ట్ కోసం కంపెనీ ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను స్వీకరిస్తోంది. కేవలం 21,000 బయానా (అడ్వాన్స్) చెల్లించి కస్టమర్లు తమ జెస్ట్ సెడాన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతం కస్టమర్లు పెట్రోల్ లేదా డీజిల్ వెర్షన్‌ను మాత్రమే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోగలరు. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం కోరుకునే వారు, కారు విడుదలైన తర్వాత మీ సమీపంలోని డీలర్‌షిప్ వద్ద వేరియంట్లు, ఫీచర్ల వివరాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








