'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ: ఫొటోలు, వివరాలు

By Ravi

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఫాల్కన్ 5 కోడ్‌నేమ్‌తో ఓ కాంపాక్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ పలు కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా.. కంపెనీ నేడు (ఫిబ్రవరి 3, 2014) ఈ మోడల్‌ను న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఈ కాంపాక్ట్ సెడాన్‌కు 'టాటా జెస్ట్' (Tata Zest) అనే పేరును ఖరారు చేస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.

ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న మాంజా సెడాన్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా టాటా మోటార్స్ తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేసింది. ఈ కారును కూడా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. టాటా బోల్ట్, టాటా జెస్ట్ ఎక్స్టీరియర్లలో కొద్ది పాటి మార్పులు మినహా, ఈ రెండు కార్లలో ఇంటీరియర్లు మాత్రం యధావిధిగా ఉంటాయి.

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ

కాంపాక్ట్ కార్లపై (4 మీటర్ల కన్నా తక్కువ పొడవు కలిగిన కార్లపై) భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొంది, తద్వారా సరసమైన ధరకే కారును అందించాలనే ఉద్దేశ్యంతో టాటా మోటార్స్ ఈ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది.

'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ

టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే టాటా జెస్ట్ ఫ్రంట్ డిజైన్ పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త కల్ ఆప్షన్స్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ

ఈ కారులో లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఎమినిటీస్‌తో అప్‌గ్రేడ్ చేసిన సరికొత్త ఇంటీరియర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ

టాటా జెస్ట్ కారులో టాటా బోల్ట్ కార్లలో ఉపయోగించిన పెట్రోల్, డీజిల్ ఇంజన్లనే ఉపయోగిస్తున్నారు. పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్‌లో, టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన 1.2 లీటర్ రెవోట్రాన్ ఎమ్‌పిఎఫ్ఐ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ

అలాగే డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో రెగ్యులర్ 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌కు బదులుగా ఇందులో శక్తివంతమైన 1.5 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇంజన్ పెర్ఫామెన్స్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ

ఈ కారులో ఆఫర్ చేయనున్న కొన్ని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 5 ఇంచ్ టచ్‍స్క్రీన్‌తో కూడిన హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టూ స్పీచ్ సిస్టమ్, ఫోన్ ఆధారిగా నావిగేషన్ సిస్టమ్ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లున్నాయి.

'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ

ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఈ రెండు కొత్త కార్లను ప్రదర్శించనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, February 3, 2014, 16:42 [IST]
English summary
Tata Zest compact sedan has just been unveiled in an event in Delhi, along with its hatchback counterpart, Bolt. Based on the company's X1 platform, Zest is a sub-4 meter compact sedan that will rival Honda Amaze and Swift DZire. Tata Zest, previously known by its codename Falcon 5, is a Manza replacement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+