ఆగస్ట్‌లో టాటా జెస్ట్, సెప్టెంబర్‌లో టాటా బోల్ట్ కార్లు విడుదల!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తృతస్థాయిలో పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఏటా రెండు కొత్త మోడళ్లను విడుదల చేయటం ద్వారా భారత మార్కెట్లో మరింత స్థిరత్వాన్ని సాధించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన తమ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ బోల్ట్ హ్యాచ్‌బ్యాక్, జెస్ట్ కాంపాక్ట్ సెడాన్లను మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల చేయనుంది.
వచ్చే ఆగస్టులో ‘జెస్ట్' కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసిన తర్వాత సెప్టెంబర్ నెలలో ‘బోల్ట్' హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. టాటా విస్టా హ్యాచ్‌బ్యాక్, టాటా మాంజా సెడాన్లకు రీప్లేస్డ్ వెర్షన్లుగా వస్తున్న టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్, టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్లు రెండు డిజైన్ పరంగా ఒకేవిధంగా ఉంటాయి, కాకపోతే జెస్ట్ సెడాన్‌లో మాత్రం పొడగించబడిన బూట్ స్పేస్ ఉంటుంది. ఈ రెండింటి డిజైన్‌లో ఇదే ప్రధానమైన వ్యత్యాసం. పాత విస్టాను ఆధారంగా చేసుకొనే ఈ రెండు మోడళ్లను డిజైన్‌ను చేసినప్పటికీ, ఇవి మోడ్రన్ లుక్‌ని కలిగి ఉంటాయి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో టాటా జెస్ట్, టాటా బోల్ట్ మోడళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త కల్ ఆప్షన్స్ ఈ మోడళ్లలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

టాటా జెస్ట్ మరియు బోల్ట్ కార్లలో 5 ఇంచ్ టచ్‍స్క్రీన్‌తో కూడిన హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టూ స్పీచ్ సిస్టమ్, ఫోన్ ఆధారిగా నావిగేషన్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి పలు ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి.

కొత్త హెడ్‌లైట్స్, కొత్త ఫాగ్ ల్యాంప్ డిజైన్, కొత్త గ్రిల్, కొత్త టెయిల్ ల్యాంప్, కొత్త బంపర్స్ మరియు సైడ్ మిర్రర్లను ఈ కార్లలో గమనించవచ్చు. టాటా జెస్ట్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, శాటిలైట్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్పీడ్ సెన్సిటివ్ పవర్ స్టీరింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. కానీ టాటా బోల్ట్‌లో ఇందులోని కొన్ని ప్రీమియం ఫీచర్లు ఉండవు.

ఈ రెండు మోడళ్లలో కూడా ఒకేరకమైన ఇంజన్లను ఉపయోగించారు. పెట్రోల్ వెర్షన్లలో టాటా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.

డీజిల్ వెర్షన్లలో మాత్రం 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా జెస్ట్ ధరలు వేరియంట్‌ను బట్టి ధర రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

టాటా బోల్ట్ ధరలు వేరియంట్‌ను బట్టి ధర రూ.6 లక్షల నుంచి రూ.6.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

టాటా నానో
కాగా.. ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కలిగిన టాటా నానో వేరియంట్‌ను కూడా ఆగస్ట్ నెలలో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








