టాటా జెస్ట్, టాటా బోల్ట్ అఫీషియల్ వెబ్‌సైట్లు లైవ్!

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ బోల్ట్ హ్యాచ్‌బ్యాక్, జెస్ట్ కాంపాక్ట్ సెడాన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ రెండు మోడళ్లను త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ దిశలో భాగంగానే, కంపెనీ ఈ రెండు మోడళ్ల కోసం ఈ రెండు వేర్వేరు మైక్రో వెబ్‌సైట్లను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: 'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ - వివరాలు

టాటా విస్టా హ్యాచ్‌బ్యాక్, టాటా మాంజా సెడాన్లకు రీప్లేస్డ్ వెర్షన్లుగా వస్తున్న టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్, టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్లు రెండు డిజైన్ పరంగా ఒకేవిధంగా ఉంటాయి, కాకపోతే జెస్ట్ సెడాన్‌లో మాత్రం పొడగించబడిన బూట్ స్పేస్ ఉంటుంది. ఈ రెండింటిలో ఇదే ప్రధానమైన వ్యత్యాసం. పాత విస్టాను ఆధారంగా చేసుకొనే ఈ రెండు మోడళ్లను డిజైన్‌ను చేసినప్పటికీ, ఇవి మోడ్రన్ లుక్‌ని కలిగి ఉంటాయి.


కొత్త హెడ్‌లైట్స్, కొత్త ఫాగ్ ల్యాంప్ డిజైన్, కొత్త గ్రిల్, కొత్త టెయిల్ ల్యాంప్, కొత్త బంపర్స్ మరియు సైడ్ మిర్రర్లను ఈ కార్లలో గమనించవచ్చు. టాటా జెస్ట్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, శాటిలైట్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్పీడ్ సెన్సిటివ్ పవర్ స్టీరింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. కానీ టాటా బోల్ట్‌లో ఇందులోని కొన్ని ప్రీమియం ఫీచర్లు ఉండవు.

ఇది కూడా చదవండి: 'టాటా జెస్ట్' కాంపాక్ట్ సెడాన్ ఆవిష్కరణ - వివరాలు

ఈ రెండు మోడళ్లలో కూడా ఒకేరకమైన ఇంజన్లను ఉపయోగించారు. పెట్రోల్ వెర్షన్లలో 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్లలో 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Zest

మరిన్ని వివరాల కోసం టాటా జెస్ట్, టాటా బోల్ట్ అఫీషియల్ వైబ్‌‌సైట్లను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Monday, March 24, 2014, 9:35 [IST]
English summary
Tata Bolt website is now live. Tata Zest website goes live, with plenty of information available. Tata Bolt & Tata Zest details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+