టెర్రా మోటార్స్ నుంచి విడుదల కానున్న ఎలక్ట్రిక్ ఆటోరిక్షా

By Ravi

జపాన్‌లో నెంబర్ వన్ అయిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెర్రా మోటార్స్ ఈ ఏడాది జనవరి నెలలో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్ కోసం ఇప్పటికే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌లను పరిచయం చేసిన టెర్రా మోటార్స్ ఈ ఏడాది అక్టోబర్ నెల నాటికి ఓ సరికొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్ (ఆటోరిక్షాను) కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్

టెర్రా మోటార్స్ భారత్‌లో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను తయారు చేసేందుకు గాను రాజ్‌కోట్‌కు చెందిన ఓ కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విజయవంతమైతే, తక్కువ నిర్వహణ ఖర్చుతో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సాంప్రదాయ ఆటోరిక్షాలకు ధీటుగా టెర్రా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా ధరను నిర్ణయించే అవకాశం ఉంటుంది. టెర్రా ఆటోరిక్షాకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

Terra T4

టెర్రా మోటార్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పో సమయంలో ఆటోరిక్షాను ప్రదర్శనకు ఉంచింది. దీని పేరు టెర్రా టి4.

Terra T4

టెర్రా టి4 ఎలక్ట్రిక్ ఆటోరిక్షా డిజైన్ చూడటానికి మన సాంప్రదాయ ఆటోరిక్షా మాదిరిగానే ఉంటుంది.

Terra T4

టెర్రా టి4 ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో 3.5 కి.వా. ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 48వోల్ట్, 120యాంప్స్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది.

Terra T4

టెర్రా టి4 ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలోని బ్యాటరీల విషయానికి వస్తే, కంపెనీ ఇందులో లీడ్ యాసిడ్ బ్యాటరీలను, లిథియం అయాన్ బ్యాటరీ ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచనుంది.

Terra T4

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టెర్రా టి4 ఎలక్ట్రిక్ ఆటోరిక్షా రేంజ్ 80 కిలోమీటర్లు. ఇందులో డ్రైవర్ కాకుండా 3-5 ప్రయాణీకులు కూర్చోవచ్చు. ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, August 21, 2014, 11:45 [IST]
English summary
Japanese electric vehicle manufacturer, Terra Motors is planning to introduce an electric autorickshaw in the Indian market around October this year. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+