ఫ్లయింగ్ కారు మొట్టమొదటి పబ్లిక్ ఫ్లయింగ్ సక్సెస్
టెర్రాఫుజియా ట్రాన్సిషన్ ఫ్లయింగ్ కారుకు సంబంధించి ఇదివరకటి కథనాల్లో చెప్పుకుంటూ వస్తున్న సంగతి తెలిసినదే. గడచిన సంవత్సరం న్యూయార్క్‌లో జరగిన "2012 న్యూయార్క్ ఇంటర్నేషల్ ఆటో షో"లో కంపెనీ ప్రజల సందర్శనార్ధం తొలిసారిగా ఈ ఫ్లయింగ్ కారును ప్రదర్శకు ఉంచారు. కాగా.. తాజాగా అమెరికాలోని విస్కాన్సిన్‌లో జరిగిన ఈఏఏ ఎయిర్‌వెంచర్ ఎయిర్ షోలో తొలిసారిగా పబ్లిక్ ఫ్లయిట్‌ను నిర్వహించారు.
ఈ ఫ్లయింగ్ కారును విజయవంతంగా ఎగిరించి సందర్శకుల చేత ఔరా అనిపించారు. టెర్రాఫుజియా ట్రాన్సిషన్ ఓ రోడ్ లీగల్ ఫ్లయింగ్ కారు. ఇది రోడ్డు, విమాన మార్గాలకు సంబంధించిన అన్ని నిమయనిబంధనలను పాటిస్తుంది. ఈ ఫ్లయింగ్ కారు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల ధర కన్నా కూడా తక్కువే. దీని ధరను 2,79,000 అమెరికన్ డాలర్లుగా (మన దేశ కరెన్సీలు సుమారు 1.4 కోట్లకు పైమాటే) నిర్ణయించారు. త్వరలోనే ఇది వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది.

అథారిటీల నుంచి గ్రీన్ సిగ్నల్
టెర్రాఫుజియా ట్రాన్సిషన్ ఇటు ఎఫ్ఎఫ్ఏ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) మరియు ఎన్‌హెచ్‌టుఎస్ఏ (నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మనిస్ట్రేషన్) స్టాండర్డ్‌లను పాటించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ కారు. ఇది మొట్టమొదటి "స్ట్రీట్ లీగల్ ఏరోప్లేన్".

ట్రాన్సిషన్ పెర్ఫామెన్స్
రోడ్డుపై గంటకు 65 మైళ్ల వేగంతో ప్రయాణించే ట్రాన్సిషన్, గాలిలో 115 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. 'ట్రాన్సిషన్ రోడబుల్ లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్'గా పిలిచే ఎగిరే కారు కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే తన రూపాన్ని మార్చుకొని పక్షిలా రెక్కలు విప్పుకొని గాల్లోకి రివ్వున ఎగిరిపోగలదు.
మైలేజ్/రేంజ్
ఈ కారును ట్యాంక్ ఫుల్ చేయించుకుని 110 మైళ్ల వేగంతో గాల్లో ప్రయాణించినట్లయితే, సుమారు 460 మైళ్ల దూరం వరకూ వెళ్లవచ్చు.
20 గంటల ట్రైనింగ్
రెండు సీట్లు, నాలుగు చక్రాలు కలిగిన తేలికరకం ఎయిర్ క్రాఫ్ట్‌ను గాలిలో నడపటానికి కేవలం 20 గంటల ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది.


Click it and Unblock the Notifications








