మరోసారి టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు..

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత సురక్షితమైన కారుగా ఈ ఏడాది యూ.ఎస్. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టిఎస్ఏ) నుంచి టాప్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కారు 'టెస్లా మోడల్ ఎస్' (Tesla Model S) మరోసారి వివాదాల్లోకెక్కింది. వరుసగా మూడో టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు చెలరేగటం ఇప్పుటు చర్చనీయాంసమైంది.

వాస్తవానికి ఈ ఏజెన్సీ టెస్ట్ చేసిన అత్యంత సురక్షితమైన కారు కూడా ఇదే కావటం గమనార్హం. ఈ కారును అత్యుత్తమ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కారుగా పరిగణిస్తారు. ఇది ఏజెన్సీ ద్వారా అత్యధిక సేఫ్టీ రేటింగ్‌లను కూడా పొందింది. దీంతో ఈ కారుపై ఇప్పటికే కొనుగోలుదారుల్లో అంచనాలు మిన్నంటాయి. కానీ, ఇటీవల జరిగిన సంఘటనలు మాత్రం కొనుగోలుదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. గడచిన ఆరు వారాల వ్యవధిలో మొత్తం 3 టెస్లా మోడల్ ఎస్ కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.

టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు

అక్టోబర్ 1, 2013న సీటెల్‌లో తొలి టెస్లా మోడల్ ఎస్ కారు అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. అధిక వేగాల వద్ద బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌కు ఓ మెటాలిక్ వస్తువును తగలటం వలన మంటలు చలరేగటమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు, ఆయన సురక్షితంగా బయటపడ్డాడు. కారులో మంటలు చెలరేగినప్పటికీ, దాని సేఫ్టీ విషయంలో తనకు ఇప్పటికీ నమ్మకం ఉందని డ్రైవర్ తెలిపాడు. ఈ సంఘటనతో తర్వాతి రోజున స్టాక్ మార్కెట్లో టెస్లా స్టాక్స్ ఒక్కసారిగా 6.2 శాతానికి పడిపోయాయి.

టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు

అక్టోబర్ 18, 2013న మెక్సికోలో రెండవ టెస్లా మోడల్ ఎస్ కారు అగ్ని కీలల్లో చిక్కుకుపోయింది. అయితే, ఈ సంఘటనలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో కారు అధిక వేగంతో ప్రయాణిస్తోంది. కారు చెట్టును గుద్దటం వలన ప్రమాదం జరిగింది.

అదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో కూడా డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. కానీ కారు మాత్రం పూర్తిగా కాలిపోయింది. అయితే, ఈ సంఘటనలో కారు నడుపుతున్న డ్రైవర్, కారు సేఫ్టీ గురించి అంత ధీమాగా లేడు.

టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు

నంబర్ 6, 2013న అమెరికాలోని టెన్నెస్సేలో మూడువ టెస్లా మోడల్ ఎస్ కారు అగ్నికి ఆహుతైంది. ఇది మొదటి ప్రమాదం లాంటిదే. కారులో చిన్నపాటి ఎలక్ట్రిక్ ఫైర్ కారణంగా, బ్యాటరీ దగ్గర మంటలు వ్యాపించి, కారు మంటల్లో కాలిపోయింది.

టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు

ఇదివరకటి ప్రమాదాల్లో మాదిరిగానే, ఈ మూడవ ప్రమాదంలో కూడా డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కానీ కారు ముందు భాగం మాత్రం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణం గురించి విచారణ జరుగుతోంది.

టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు

ప్రపంచంలో కెల్లా అత్యంత సురక్షితమైన కారుగా పేరు దక్కించుకున్న టెస్లా మోడల్ ఎస్ ఒక్క నెల వ్యవధిలోనే 3 కార్లు అగ్నికి ఆహుతి కావటంతో ఈ కారు సేఫ్టీపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు

వాస్తవానికి ఇంటర్నల్ కంబస్టిన్ ఇంజన్ కలిగిన కార్లు హై స్పీడ్స్ వద్ద క్రాష్ అయినప్పుడు అగ్ని పుట్టడటం సహజమే. ఇలాంటి సంఘటనలు పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించవు. కానీ టెస్లా మోడల్ ఎస్ కారును ఇదే విభాగంలో పరిగణించడం గమనార్హం.

టెస్లా మోడల్ ఎస్ కారులో మంటలు

బ్యాటరీ ప్యాక్ అంటుకోవటం అనేది అసాధారమైన విషయమేమీ కాదు, సాధారణంగా బ్యాటరీకి ఏదైనా మెటల్ భాగం గుచ్చుకుంటే అది భగ్గుమంటుంది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ కార్లలో ఇంధన ట్యాంక్‌కు ఏదైనా డ్యామేజ్ వాటిళ్లితేనే ప్రమాదం జరుగుతుంది. అంటే, దీని అర్థం టెస్లా మోడల్ ఎస్‌లో ఎలాంటి తయారీ లోపాలు లేవని.

More from DriveSpark

Article Published On: Friday, November 8, 2013, 13:33 [IST]
English summary
Tesla Model S, considered by many as the best electric passenger car ever, even surpassed the highest overall safety ratings awarded by the agency. Naturally, the public's confidence in the car was very high. Was. That's because that confidence has somewhat been shaken by recent developments which took place within the past six weeks. But it's not a deal that it's being made into. Here's why.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+