2015లో విడుదల కానున్న టాప్ 10 కార్లు
భారత ఆటోమొబైల్ పరిశ్రమకు 2014వ సంవత్సరం పెద్దగా కలిసిరానప్పటికీ, అనేక కొత్త కార్లు మార్కెట్లో విడుదలయ్యాయి. మిశ్రమ స్పందనతో 2014వ సంవత్సరాన్ని ముగించనున్న కార్ మేకర్లు, 2015వ సంవత్సరం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి.
కొత్త సంవత్సరంలో సరికొత్త కార్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది కొన్ని పాపులర్ కార్లు, అలాగే సరికొత్త మోడళ్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో 2015లో విడుదల కానున్న టాప్ 10 కార్ల గురించి తెలుసుకోండి.

డాట్సన్ గో ప్లస్
డాట్సన్ బ్రాండ్ నుంచి రానున్న రెండ మోడల్ గో ప్లస్ ఎమ్‌పివి. జనవరి 15, 2014వ తేదీన డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మార్కెట్లో విడుదల కానుంది. డాట్సన్ గో ప్లస్ కారుకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా బోల్ట్
టాటా జెస్ట్ తర్వాత టాటా మోటార్స్ నుంచి రానున్న మరో సరికొత్త మోడల్ టాటా బోల్ట్. జనవరి 20, 2014వ తేదీన టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విడుదల కానుంది. టాటా బోల్ట్ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఫియట్ అబార్త్
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్‌కి చెందిన పెర్ఫామెన్స్ కార్ డివిజన్ అబార్త్ (Abarth) ఈ ఏడాది జనవరి నెలలో తమ కొత్త '595 కాంపిటీషన్' లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఫియట్ అబార్త్ 595 కాంపిటీషన్ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

రెనో లాజీ
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా నుంచి రానున్న మొట్టమొదటి ఎమ్‌పివి 'రెనో లాజీ' (Renault Lodgy) ఈ ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల కానుంది. వాస్తవానికి, లాజీ ఎమ్‌పివిని ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో డాసియా బ్యాడ్జ్ క్రింద విక్రయిస్తున్నారు. రెనో లాజీ ఒక 7-సీటర్ ఎమ్‌పివి. మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

హోండా జాజ్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నుంచి 2015లో విడుదల కానున్న సరికొత్త మోడల్ 'హోండా జాజ్' (Honda Jazz). గతంలో కంపెనీ నిలిపివేసిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను సరికొత్త లుక్ అండ్ ఫీల్‌తో, అత్యాధునిక ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఇది మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్
అమెరికన్ కార్ ఫోర్డ్, గడచిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో ఆవిష్కరించిన 'ఫిగో కాంపాక్ట్ సెడాన్'ను ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఫోర్డ్ 'కా కాన్సెప్ట్' (Ka Concept) హ్యాచ్‌బ్యాక్‌కు కాంపాక్ట్ సెడాన్ రూపమే ఈ ఫోర్డ్ ఫిగో కాన్సెప్ట్. ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ సెడాన్లకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో, ఫోర్డ్ వీలైనంత త్వరగా ఈ మోడల్‌ను దేశీయ విపణిలో విడుదల చేయాలని భావిస్తోంది.

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ
దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. కంపెనీ ఇప్పటికే 'ఎస్101' (S101) అనే కోడ్‌నేమ్‌తో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. మహీంద్రా ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీని సరికొత్త మోనోకాక్ ఛాస్సిస్‌పై నిర్మించారు. ఇది నాలుగు మీటర్ల తక్కువ పొడవును కలిగి ఉంటుంది. ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభించే ఆస్కారం ఉంది.

సెలెరియో డీజిల్
మారుతి సుజుకి నుంచి హాట్ కేకుల్లా అమ్మడుపోతున్న సరికొత్త చిన్న కారు 'సెలెరియో'లో కంపెనీ ఓ డీజిల్ వెర్షన్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇప్పటికే డీజిల్ వెర్షన్ సెలెరియోని ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలోగా మారుతి సెలెరియో డీజిల్ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా

హ్యుందాయ్ ఐఎక్స్25
దేశీయ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో, హ్యుందాయ్ కూడా ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు ఉరకలు వేస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న ఐఎక్స్25 మోడల్‌ను ఇండియాలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఎలైట్ ఐ20 క్రాస్
ఈ కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ నుంచి రానున్న మరో కొత్త ఉత్పత్తి ఎలైట్ ఐ20 క్రాస్. హ్యుందాయ్ ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ క్రాసోవర్ వెర్షన్‌ను రూపొందిస్తోంది.


Click it and Unblock the Notifications








