హైదరాబాద్‌లో ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013 ప్రారంభం

By Ravi

లగ్జరీ వస్తువులు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మన హైదరాబాదీలు కూడా ఈ విలాసవంతమైన వస్తువల పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరి క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు లగ్జరీ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు నగరంలో భారీ ప్రదర్శనలు ఏర్పాటు చేసి, కస్టమర్లను కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

తాజాగా, నగరంలోని ఫిల్మ్‌నగర్, జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో 'ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013' (టైల్) ప్రారంభమైంది. ఈనెల 13వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన 15వ తేది వరకు జరుగుతుంది. ఈసారి 2013 ఎడిషన్ ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పోలో అనేక కొత్త బ్రాండ్‌లు వచ్చి చేరాయి. అనేక ఖరీదైన, విలాసవంతమైన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013 అత్యంత ఖరీదైన కార్లు, బైక్‌తో పాటుగా విదేశాలకు చెందిన చాక్లెట్లు, బొమ్మలు, ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్, ఖరీదైన వాచ్‌లు వంటి అనేక వస్తువులను, కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. మరి మనం కూడా వాటిపై ఓ లుక్కేద్దాం రండి..!

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

హైదరాబాదీలు ఆకట్టుకునేందుకు 2013 ఎడిషన్ ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో సిద్ధమైంది. డిసెంబర్ 13న ప్రారంభమైన ఈ ఎక్స్‌పో డిసెంబర్ 15 (ఆదివారం) వరకు కొనసాగుతుంది.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం రోజు ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

గడచిన సంవత్సరం ప్రారంభించిన 2012 ఎడిషన్ ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో మంచి సక్సెస్‌ను సాధించడంతో ఈసారి 2013 ఎడిషన్ లగ్జరీ ఎక్స్‌పోను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ఈ ఎక్స్‌పోకు విచ్చేసే అతిథులను ప్రత్యేకంగా పర్సనల్ ఇన్విటేషన్ ద్వారా ఆహ్వానించడం జరుగుతుందని, అడ్వైజరీ బోర్డ్ సభ్యుల ద్వారా ఈ క్లైంట్‌లను ఎంచుకోవడం జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ఎయితే, ఎవరైనా ఈ ఎక్స్‌పోకు రావాలని నిర్ణయించుకొని, అలాంటి వారికి పర్సనల్ ఇన్విటేషన్ అందకపోయినట్లయితే, వారు నేరుగా వేదిక దగ్గర పాస్‌ను కొనుగోలు చేసుకోవటం లేదా బుక్ మై షో ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవటం చేయవచ్చు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

అయితే, ఎవరైనా ఈ ఎక్స్‌పోకు రావాలని నిర్ణయించుకొని, అలాంటి వారికి పర్సనల్ ఇన్విటేషన్ అందకపోయినట్లయితే, వారు నేరుగా వేదిక దగ్గర పాస్‌ను కొనుగోలు చేసుకోవటం లేదా బుక్ మై షో ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవటం చేయవచ్చు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో - 2013లో మొత్తం 35 బ్రాండ్‌లు పాల్గొని, తమ ఉత్పత్తులను ప్రదర్శనకు/విక్రయానికి ఉంచనున్నాయి.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ఈ 35 బ్రాండ్లలో ఆటోమొబైల్ బ్రాండ్ల విషయానికి వస్తే, ఆస్టన్ మార్టిన్, పోలారిస్, వోల్వో, జాగ్వార్ ల్యాండ్ రోవర్, హ్యోసంగ్, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ బ్రాండ్లున్నాయి.

ఈ ఫొటోలో ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ కారును చూడొచ్చు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ఈ ఏడాది జరుగుతున్న 2013 ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పోలో 'లాంబోర్గినీ ముర్సిలాగో ఎల్‌పి-640' సూపర్‌కారు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ఈ లాంబోర్గినీ ముర్సిలాగో ఎల్‌పి-640 సూపర్‌కారు మరెవరిదో కాదు. మన ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ది. సికింద్రాబాద్‌కు చెందిన సందీప్‌సింగ్ ఈ కారును యువరాజ్ నుంచి కొనుగోలు చేసి ఇక్కడ ప్రదర్శించేందుకు తీసుకొచ్చారు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

సందీప్ సింగ్ ఈ కారును కొనుగోలు చేయటం కోసం సుమారు రూ.7.50 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ కారులో 6.5 లీటర్ వి-12 డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 649 బిహెచ్‌పిల శక్తిని, 67.3 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో ఇది లభిస్తుంది.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ఈ సూపర్ కారు కేవలం 3.8 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 340 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు. ఇది లీటరు పెట్రోల్‌కు కేవలం 3-5 కి.మీ. మైలేజిని మాత్రమే ఇస్తుంది.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ధూమ్ 3 చిత్రంలో అమీర్ ఖాన్ నడిపినటువంటి బిఎమ్‌డబ్ల్యూ కె1300ఆర్ సూపర్‌బైక్‌ను కూడా ఈ షోలో ప్రదర్శించారు. ఇందులో 1293సీసీ వాటర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 173 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

3 ఇడియట్స్ కారు

3 ఇడియట్స్ కారు

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013లో అమీర్ ఖాన్ నటించిన '3 ఇడియట్స్' చిత్రంలో ఉపయోగించిన వోల్వో కారును కూడా ప్రదర్శనకు ఉంచారు. క్లైమాక్స్ సీన్ ఈ కారును ప్రధానంగా కనిపిస్తుంది.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు చెందిన జాగ్వార్ లగ్జరీ కారును ఈ ప్రదర్శనలో ఉంచారు.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీని ఈ ప్రదర్శనలో హైలైట్‌గా నిలిచింది.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

అమెరికాకు చెందిన ప్రమఖ ఏటివి (ఆల్ టెర్రైన్ వెహికల్) తయారీ కంపెనీ పోలారిస్ తమ విస్తృతస్థాయి ఉత్పత్తులను, ఆఫ్-రోడింగ్ వాహనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచింది.

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013

ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో 2013లో అమీర్ ఖాన్ నటించిన '3 ఇడియట్స్' చిత్రంలో ఉపయోగించిన వోల్వో కారును కూడా ప్రదర్శనకు ఉంచారు. క్లైమాక్స్ సీన్ ఈ కారును ప్రధానంగా కనిపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 14, 2013, 10:35 [IST]
English summary
The Indian Luxury Expo brings in leading luxury brands across 30 lifestyle segments like Art & Collectibles, Cars, Luxury Homes, Women’s Accessories, Banking, Fragrances, Footwear, Travel and more to an elite and discerning target audience. The expo is an ideal podium for both local and foreign brands to obtain maximum benefit by sharing their experience and expertise.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+