విడుదలకు సిద్ధమైన మినీ క్లబ్ వ్యాన్; ఆ మార్కెట్లే టార్గేట్!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వ్యాన్‌ను గుర్తుపట్టారా..? పక్కనున్న కుక్కని చూసి ఇదేదో కుక్కల బండి అనుకోకండి..! గడచిన సంవత్సరం మార్చి నెలలో జరిగిన 2012 జెనీవా అంతర్జాతీ మోటార్ షోలో బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ 'మినీ' ఆవిష్కరించిన 'మినీ క్లబ్‌వ్యాన్' త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. మినీ ప్రవేశపెట్టిన ఈ సరికొత్త క్లబ్‌వ్యాన్ కాన్సెప్ట్‌కు మార్కెట్ నుండి మంచి స్పందన లభించడంతో ప్రస్తుతం ఈ మోడల్‌ను కంపెనీ ఉత్పత్తి దశకు తీసుకువెళ్లింది.
ఎస్టేట్ కార్, డెలివరీ వ్యాన్ వంటి బాడీస్టైల్ కలిగిన కార్లకు పోటీగా మినీ తమ ఈ క్లబ్‌వ్యాన్‌ను ప్రవేశపెట్టనుంది. లగ్జరీ రవాణా వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ క్లబ్‌వ్యాన్‌ను తయారు చేసింది. ఫ్యాషన్ డిజైనర్స్, ఆర్ట్ గ్యాలరీ ఓనర్స్, క్యాటరింగ్ సర్వీసెస్ వంటి ప్రయోజనాల కోసం ఇది చక్కగా సరిపోతుందని మినీ పేర్కొంది. తొలుతగా ఇది అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో విడుదల కానుంది. అక్కడి మార్కెట్లో దీని ప్రారంభ ధర 25,985 డాలర్లు (పన్నులు, డెలివరీ ఛార్జీలు కలుపుకొని).
మినీ బ్రాండ్ నుండి అత్యంత పాపులర్ అయిన 'క్లబ్‌మ్యాన్' ఎస్‌యూవీ మోడల్ ఆధారంగా క్లబ్‌వ్యాన్ కాన్సెప్ట్‌ను కంపెనీ రూపొందించింది. ఇందులో రెండు సీట్లు మాత్రమే (డ్రైవర్ + ప్యాసింజర్) ఉండి, ఐదు డోర్లను కలిగి ఉంటుంది. వెనుకవైపు ఉండే రెండు క్యాబిన్ డోర్లు గవ్వ (షెల్) మాదిరిగా ఒకటి కుడివైపుకు మరొకటి ఎడమవైపుకు ఓపెన్ అవుతాయి.ఇందులో కార్గో స్థలాన్ని ఫ్రంట్ సీటింగ్ స్థలాన్ని వేరు చేస్తూ ఓ ధృడమైన అల్యూమినియం మరియు స్టెయిన్‌లెన్ స్టీల్ హనీ కోంబ్ గ్రిల్ ఉంటుంది. ఇది 1102 పౌండ్ల బరువును మోయగలదు. ఇందులో 30.37 చ.అ. కార్గో స్పేస్ ఉంటుంది.
ఈ క్లబ్‌వ్యాన్ కాన్సెప్ట్ ఒకపట్టి మారియోస్ మినీ ట్రావెలర్‌ను గుర్తుకు తెస్తుందని, స్టైలిష్ యుటిలిటీ వెహికల్ కోరుకునే వారి కోసం ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశామని మినీ పేర్కొంది. మినీ క్లబ్‌వ్యాన్ ఇప్పట్లో ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ, భవిష్యత్తులో ఇండియాకు వచ్చినా అది ఎంత మేర సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈలోపుగా మినీ క్లబ్‌వ్యాన్‌ను టాప్ టూ బాటమ్ ఓ లుక్కేస్కోండి మరి..!

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్

మినీ క్లబ్‌వ్యాన్



Click it and Unblock the Notifications








