రూ.10 లక్షల లోపు లభించే టాప్ 10 బెస్ట్ సెడాన్ కార్లు
సిటీ రోడ్లకు, చిన్న కుటుంబాలకు హ్యాచ్‌బ్యాక్ కార్లు సరిపోతాయి. కానీ తరచూ దూర ప్రయాణాలు చేసేవారికి మరియు కాస్తంత విశాలమైన కారు కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ సెడాన్. సెడాన్లు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా పొడవుగా, విశాలంగా ఉండి లోపల ఉన్న ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతిని కల్పించడమే కాకుండా, మంచి లగేజ్ స్పేస్‌ను కూడా ఆఫర్ చేస్తాయి.
అయితే, వీటి ధర మాత్రం హ్యాచ్‌బ్యాక్ కార్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, కారు అనేది వన్ టైమ్ ఇన్వెస్టిమెంట్ కాబట్టి, కారును కొనేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి మీకు ఏ కారు సూట్ అవుతుందో తెలుసుకోగలగాలి. ధర పరంగా ఈ రెండు రకాల కార్లకు భారీ తేడా ఏమీ ఉండదు. మనదేశంలో కేవలం రూ.10 లక్షల దిగువన లభిస్తున్న టాప్ 10 సెడాన్ కార్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
మరిన్ని వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‍ను పరిశీలీంచండి.

టాటా మాంజా
ధరల శ్రేణి: రూ.5.92 లక్షల నుంచి రూ.8.14 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 21 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) - 13.7 కెఎమ్‌పిఎల్

నిస్సాన్ సన్నీ
ధరల శ్రేణి: రూ.6.08 లక్షల నుంచి రూ.9.14 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 16.95 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (పెట్రోల్) ఆటోమేటిక్ - 17.97 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) - 21.1 కెఎమ్‌పిఎల్

ఫోక్స్‌వ్యాగన్ వెంటో
ధరల శ్రేణి: రూ.6.99 లక్షల నుంచి రూ.9.23లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 15.04 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (పెట్రోల్) ఆటోమేటిక్ - 14.4 కెఎమ్‌పిఎల్

ఫియట్ లీనియా
ధరల శ్రేణి: రూ.7.12 లక్షల నుంచి రూ.9.55 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 14.6 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) - 20.4 కెఎమ్‌పిఎల్

స్కొడా ర్యాపిడ్
ధరల శ్రేణి: రూ.7.12 లక్షల నుంచి రూ.9.76 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 15.42 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (పెట్రోల్) ఆటోమేటిక్ - 14.4 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) - 20.54

మారుతి ఎస్ఎక్స్4
ధరల శ్రేణి: రూ.7.22 లక్షల నుంచి రూ.9.80 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 16.51 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) - 21.79 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (సిఎన్‌జి) - 22.1 కి.మీ/కేజీకి

రెనో స్కాలా
ధరల శ్రేణి: రూ.7.26 లక్షల నుంచి రూ.10.09 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 16.95 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (పెట్రోల్) ఆటోమేటిక్ - 17.97 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) - 21.64 కెఎమ్‌పిఎల్

హోండా సిటీ
ధరల శ్రేణి: రూ.7.29 లక్షల నుంచి రూ.10.62 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 16.8 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (పెట్రోల్) ఆటోమేటిక్ - 15.6 కెఎమ్‌పిఎల్

హ్యుందాయ్ వెర్నా
ధరల శ్రేణి: రూ.7.29 లక్షల నుంచి రూ.11.47 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) 1.4 లీటర్e - 17.43 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (పెట్రోల్) 1.6 లీటర్e - 17.01 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (పెట్రోల్) ఆటోమేటిక్ - 15.74 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) 1.6 లీటర్e - 22.32 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) 1.4 లీటర్e -23.5 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) 1.6 ఆటోమేటిక్ - 19.08 కెఎమ్‌పిఎల్

ఫోర్డ్ ఫియస్టా
ధరల శ్రేణి: రూ.7.46 లక్షల నుంచి రూ.10.31 లక్షలు
మైలేజ్ (పెట్రోల్) - 17.0 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (పెట్రోల్) ఆటోమేటిక్ - 16.97 కెఎమ్‌పిఎల్
మైలేజ్ (డీజిల్) - 23.5 కెఎమ్‌పిఎల్
గమనిక: ఇందులో పేర్కొన్న ధరలన్నీ ఎక్స్-షోరూమ్, ప్రాంతాన్ని బట్టి మరియు డీలరును బట్టి ఇవి మారే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








