జులైలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్స్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసినదే. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ కార్ల జాబితాను పరిశీలిస్తే అందులో దాదాపు మొదటి నాలుగు కార్లు మారుతి సుజుకికి చెందినవే ఉంటాయి. ఈ జాబితాలో ఎల్లప్పుడూ ఆల్టోనే అగ్రస్థానంలో ఉంటుంది. అయితే, తొలిసారిగా ఆల్టో ఆ అగ్రస్థానాన్ని కోల్పోయింది.
మరిన్ని టాప్ 10 కథనాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి
మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్ సెడాన్ గడచిన జులై నెల అమ్మకాలలో ఆల్టో మోడల్‌ను ఓవర్‌టేక్ చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. పరిశ్రమ గణాంకాల ప్రకారం, గడచిన జులై నెలలో మారుతి సుజుకి మొత్తం 18,634 స్విఫ్ట్ డిజైర్ కార్లను విక్రయించగా, కేవలం 16,997 ఆల్టో కార్లను మాత్రమే విక్రయించింది. జులై నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలను ఈ కథనంలో చూడండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో జులై నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయి టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం రండి.

1. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు జులై 2014లో 18,634 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో 15,249 యూనిట్లుగా ఉన్నాయి.

2. మారుతి సుజుకి ఆల్టో
ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే మారుతి ఆల్టో గడచిన జులై నెలలో ద్వితీయ స్థానానికి పడిపోయింది. జులై 2014లో మారుతి సుజుకి మొత్తం 18,634 ఆల్టో కార్లను విక్రయించగా, అంతకు ముందు ఇదే సమయంలో కంపెనీ 18,206 ఆల్టో కార్లను విక్రయించింది.

3. మారుతి సుజుకి స్విఫ్ట్3. మారుతి సుజుకి స్విఫ్ట్
ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాలు జులై 2014లో 15,703 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 10,461 యూనిట్లుగా నమోదయ్యాయి.

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్
ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు జులై 2014లో 11,762 యూనిట్లుగా నమోదైతే అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 13,409 యూనిట్లుగా ఉన్నాయి.

5. హోండా సిటీ
హోండా సిటీ సెడాన్‌లో కంపెనీ డీజిల్ వెర్షన్‌తో పాటుగా రిఫ్రెష్డ్ డిజైన్‌తో మార్కెట్లో విడుదల చేయటంతో ఈ మోడల్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ జాబితాలో హోండా సిటీ ఐదవ స్థానంలో ఉంది. జులై 2014లో మొత్తం 7,705 యూనిట్లు అమ్ముడుపోయాయి.

6. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అమ్మకాలు గడచిన జులై 2014లో 7,023 యూనిట్లుగా నమోదయ్యాయి.

7. హ్యుందాయ్ ఎక్సెంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ సెడాన్ ఎక్సెంట్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. గడచిన జులై నెలలో హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు 6,652 యూనిట్లుగా నమోదయ్యాయి.

8. మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి ఇండియా ఇటీవలే విడుదల చేసిన సెలెరియో ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ ఏడాది జులై 2014లో మారుతి సుజుకి 6,394 యూనిట్ల సెలెరియో కార్లను విక్రయించింది.

9. హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న పాపులర్ స్మాల్ ఇయాన్ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఇందులో కంపెనీ ఇటీవల 1 లీటర్ ఇంజన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. గడచిన జులై 2014లో హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు 6,035 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 6,946 యూనిట్లుగా ఉన్నాయి.

10. హోండా అమేజ్
టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్స్ జాబితాలో 10వ స్థానంలో ఉన్నది హోండా అమేజ్. జులై 2014 హోండా కార్స్ ఇండియా మొత్తం 4,507 అమేజ్ కాంపాక్ట్ సెడాన్లను విక్రయించింది.


Click it and Unblock the Notifications








