డిసెంబర్ 2013 నెలలో అమ్ముడైన 'టాప్ 10' కార్లు ఇవే!

By Ravi

ఇయర్ ఎండ్ సేల్ పేరిట గడచిన నెలలో పలు కార్ కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షనీయమైన ఆఫర్లు ప్రకటించడంతో, డిసెంబర్ 2013 నెలలో కార్ల అమ్మకాలు ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించాయి. ఏదేమైనప్పటికీ, అధిక ఇంధన ధరలు, అందని వడ్డీ రేట్ల, దిగిరాని ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలు మాత్రం భారతదేశంలో కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు తయారీదారులు, డీలర్లు పలు ప్రత్యేకమైన ఆఫర్లను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నప్పటికీ, అవి వినియోగదారులపై పెద్దగా ఆశించిన రీతిలో ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి. కొత్త సంవత్సరంలోనైనా ఈ పరిస్థితి మెరుగుపడదగలదని కార్ల తయారీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. గడచిన డిసెంబర్ 2013 నెలలో అమ్ముడైన టాప్ 10 కార్ మోడళ్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఎవర్‌గ్రీన్ మోడల్ ఆల్టో ఎప్పటిలాగే డిసెంబర్ 2013 నెలలో కూడా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. గడచిన నెలలో మొత్తం 23,823 ఆల్టో కార్లు (ఆల్టో 80, ఆల్టో కె10 రెండూ కలిపి) అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్

డిసెంబర్ 2013 నెలలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు జోరుగానే సాగాయి. గడచిన నెలలో మొత్తం 16,788 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు స్విఫ్ట్ డిజైర్. డిసెంబర్ 2013 నెలలో మొత్తం 15,427 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ఈ టాప్ 10 కార్ల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న మోడల్ కూడా మారుతి సుజుకికి చెందినదే. డిసెంబర్ 2013 నెలలో కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ 12,154 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఐ10 గ్రాండ్ ఇటు పెట్రోల్ అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో సరసమైన ధరకే లభిస్తుండటంతో దీని అమ్మకాలు జోరందుకున్నాయి. డిసెంబర్ నెలలో మొత్తం 9,077 ఐ10 గ్రాండ్ కార్లు అమ్ముడుపోయాయి.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ బొలెరో ఎప్పటి మాదిరిగానే కంపెనీకి ఎవర్‌గ్రీన్ మోడల్‌గా నిలిచింది. డిసెంబర్ 2013 నెలలో మొత్తం 8,465 బొలెరో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి ఓమ్నీ

మారుతి సుజుకి ఓమ్నీ

మారుతి సుజుకి అందిస్తున్న మినీ వ్యాన్ ఓమ్నీ అమ్మకాలు కూడా జోరుగానే సాగాయి. గడచిన డిసెంబర్ 2013 నెలలో మొత్తం 5,590 మారుతి సుజుకి ఓమ్నీలు సేల్ అయ్యాయి.

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ రాకతో హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన డిసెంబర్ 2013 నెలలో మొత్తం 5,428 ఇయాన్ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి సుజుకి ఎర్టిగా

నవంబర్ 2013 నెలలో మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి అమ్మకాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. గడచిన నెలలో మొత్తం 4,924 ఎర్టిగా ఎమ్‌పివిలు అమ్ముడయ్యాయి.

టొయోటా ఇన్నోవా

టొయోటా ఇన్నోవా

గడచిన నెలలో టొయోటా ఇన్నోవా అమ్మకాలు, అంతకు ముందు నెలతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. డిసెంబర్ 2013 నెలలో మొత్తం 4,918 టొయోటా ఇన్నోవాలు ఎమ్‌పివిలు అమ్ముడయ్యాయి.

 
English summary
Domestic passenger car sales declined 4.52 per cent to 1,32,561 units in December compared with 1,38,835 units sold in the year-ago month. Here is the top 10 car models sold in December 2013.
Please Wait while comments are loading...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+