అక్టోబర్ 2014లో అమ్ముడైన టాప్ 10 కార్ మోడల్స్

అమ్మకాల లక్ష్యాలను చేరుకునేందుకు, స్టాక్ క్లియర్ చేసుకునేందుకు కార్ కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షనీయమైన ఆఫర్లు ప్రకటించడంతో, దీనికి తోడు అనేక కార్ కంపెనీ తమ సరికొత్త వాహనాలను మార్కెట్లో విడుదల చేయటంతో అక్టోబర్ 2014 నెలలో కార్ల అమ్మకాలు మిశ్రమ స్పందనను కనబరిచాయి.

ఏదేమైనప్పటికీ, ఇంధన ధరలు, వడ్డీ రేట్ల, ద్రవ్యోల్బణం వంటి పలు అంశాలు మాత్రం ఇంకా కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయని చెప్పాలు. కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు తయారీదారులు, డీలర్లు పలు ప్రత్యేకమైన ఆఫర్లను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నప్పటికీ, అవి వినియోగదారులపై పెద్దగా ఆశించిన రీతిలో ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి.

అయితే, త్వరలోనే ఈ పరిస్థితి మెరుగుపడదగలదని కార్ల తయారీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గడచిన అక్టోబర్ 2014 నెలలో అమ్ముడైన టాప్ 10 కార్ మోడళ్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

అక్టోబర్ 2014లో అమ్ముడైన టాప్ 10 కార్ మోడల్స్

ఎప్పటిలానే అక్టోబర్ 2014 నెలలో కూడా అమ్మకాల పరంగా మారుతి సుజుకినే అగ్రగామిగా ఉంది. గడచినెలలో అమ్ముడైన టాప్ 10 కార్లలో 6 కార్లు మారుతి సుజుకివే కావటం విశేషం. తర్వాతి స్లైడ్‌లలో అక్టోబర్ 2014 నెలలో అమ్ముడుపోయిన టాప్ 10 కార్లను పరిశీలించండి.

ఆల్టో

ఆల్టో

కొత్త ఆల్టో కె10 విడుదలతో గడచిన నెలలో మారుతి సుజుకి ఆల్టో మోడల్ అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఆల్టో మోడల్ అమ్మకాలు గడచిన నెలలో 21,443 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఆల్టో అమ్మకాలు 22,574 యూనిట్లుగా ఉన్నాయి.

స్విఫ్ట్ డిజైర్

స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 16,542 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ కార్లు అమ్ముడుపోయాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 16,222 యూనిట్లుగా నమోదయ్యాయి.

వ్యాగన్ఆర్

వ్యాగన్ఆర్

ఎప్పుడూ నాలుగైదు స్థానాల్లో ఉండే వ్యాగన్ఆర్ ఈసారి ఈ జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. గడచిన అక్టోబర్ నెలలో మొత్తం 14,310 యూనిట్ల మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 14,270 యూనిట్లుగా నమోదయ్యాయి.

స్విఫ్ట్

స్విఫ్ట్

మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడచిన అక్టోబర్ నెలలో మొత్తం 11,965 యూనిట్ల మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 19,047 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఎలైట్ ఐ20

ఎలైట్ ఐ20

హ్యుందాయ్ కొత్తగా ప్రవేశపెట్టిన ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన అక్టోబర్ నెలలో మొత్తం 8,895 యూనిట్ల ఐ20 కార్లు అమ్ముడుపోయాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 6,045 యూనిట్లుగా నమోదయ్యాయి.

గ్రాండ్ ఐ10

గ్రాండ్ ఐ10

అలాగే, హ్యుందాయ్ అందిస్తున్న గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు కూడా వృద్ధి చెందాయి. గడచిన అక్టోబర్ నెలలో మొత్తం 8,400 యూనిట్ల గ్రాండ్ ఐ10 కార్లు అమ్ముడుపోయాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 11,519 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇయాన్

ఇయాన్

హ్యుందాయ్ అందిస్తున్న మరో చిన్న కారు ఇయాన్ అమ్మకాలు గడచిన అక్టోబర్ నెలలో 6,986 యూనిట్లుగా నమోదు కాగా, అంతకు ముందు సంవత్సరంలో ఇవి 6,867 యూనిట్లుగా నమోదయ్యాయి.

సియాజ్

సియాజ్

మారుతి సుజుకి ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు బాగానే ఉన్నాయి. గడచిన అక్టోబర్ 2014 మొత్తం 6,345 యూనిట్ల మారుతి సుజుకి సియాజ్ కార్లు అమ్ముడుపోయాయి.

సెలెరియో

సెలెరియో

మారుతి సుజుకి తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన మరో చిన్న కారు సెలెరియో కస్టమర్లను చక్కగా ఆకట్టుకుంటోంది. గడచిన అక్టోబర్ 2014 నెలలో మొత్తం 5,723 సెలెరియో కార్లు అమ్ముడుపోయాయి.

సిటీ

సిటీ

మారుతి సుజుకి సియాజ్ రాకతో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సిటీ అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గడచిన అక్టోబర్ నెలలో మొత్తం 5,120 యూనిట్ల సిటీ సెడాన్లు అమ్మడయ్యాయి.

Most Read Articles

English summary
Car makers suffered post-festive season pangs in October with major companies reporting decline in domestic sales. Here is the top 10 cars sold in October 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X