భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే టాప్ 10 కార్లు
భారత మార్కెట్లో వాహనాలను ఉత్పత్తి చేసే దేశీయ, విదేశీయ కంపెనీలు స్థానిక మార్కెట్ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, పలు అంతర్జాతీయ మార్కెట్లకు సైతం భారత్‌లో ఉత్పత్తి అయిన వాహనాలను ఎగుమతి చేస్తున్నాయి.
ఎగుమతుల విషయంలో, ప్రస్తుతం భారతదేశంలో కెల్లా అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా (అంతర్జాతీయ అమ్మకాల పరంగా) హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పలు దేశీయ, విదేశీయ కంపెనీలు ఉన్నాయి.
ఈనాటి మన కథనంలో, గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్ కార్ల గురించి తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో టాప్ 10 ఎక్స్‌పోర్ట్ మోడళ్ల గురించి తెలుసుకోండి.

1. హ్యుందాయ్ ఐ10
ఎగుమతుల్లో నెంబర్ వన్ హ్యుందాయ్ ఐ10. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 29 శాతం క్షీణించినప్పటికీ, ఇది నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగింది. ఈ సమయంలో కంపెనీ మొత్తం 1,09,074 ఐ10 కార్లను ఎగుమతి చేసింది.
ఇది కూడా చూడండి: హ్యుందాయ్ ఐ10 పూర్తి వివరాలు
2. నిస్సాన్ మైక్రా
ఎగుమతుల్లో ద్వితీయ స్థానంలో ఉన్నది నిస్సాన్ మైక్రా. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 13 శాతం వృద్ధి చెందాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 78,383 మైక్రా కార్లను ఎగుమతి చేసింది.
ఇది కూడా చూడండి: నిస్సాన్ మైక్రా పూర్తి వివరాలు
3. హ్యుందాయ్ ఐ20
ఇక ఈ జాబితాలో తృతీయ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ ఐ20. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 7 శాతం వృద్ధి చెందాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 59,789 ఐ20 కార్లను ఎగుమతి చేసింది.
ఇది కూడా చూడండి: హ్యుందాయ్ ఐజెన్-ఐ20 పూర్తి వివరాలు
4. మారుతి ఏ-స్టార్
మారుతి సుజుకి ఏ-స్టార్ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయటంతో ఈ మోడల్ ఎగుమతులు క్షీణించాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 16 శాతం క్షీణించాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 45,193 ఏ-స్టార్ కార్లను ఎగుమతి చేసింది.

5. నిస్సాన్ సన్నీ
నిస్సాన్ ఇండియా అందిస్తున్న సన్నీ ఎగుమతులు క్రమంగా జోరందుకున్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 26 శాతం వృద్ధి చెందాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 37,730 సన్నీ కార్లను ఎగుమతి చేసింది.
ఇది కూడా చూడండి: నిస్సాన్ మైక్రా పూర్తి వివరాలు
6. ఫోక్స్‌వ్యాగన్ వెంటో
ఈ సమయంలో ఫోక్స్‌వ్యాగన్ ఎగుమతులు అనూహ్యంగా దాదాపు మూడింతలు పెరిగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కేవలం 8,106 వెంటో కార్లను మాత్రమే ఎగుమతి చేసిన కంపెనీ గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 32,017 వెంటో కార్లను ఎగుమతి చేసి 295 శాతం వృద్ధిని సాధించింది.
ఇది కూడా చూడండి: ఫోక్స్‌వ్యాగన్ వెంటో పూర్తి వివరాలు
7. హ్యుందాయ్ యాక్సెంట్
హ్యుందాయ్ తమ యాక్సెంట్ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేయటంతో ఈ మోడల్ ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 2 శాతం క్షీణించాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 29,107 యాక్సెంట్ సెడాన్లను ఎగుమతి చేసింది.

8. ఫోర్డ్ ఫిగో
ఫోర్డ్ ఫిగో ఎగుమతులు కూడా స్వల్పంగా తగ్గాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 2 శాతం క్షీణించాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 28,304 ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లను ఎగుమతి చేసింది.
ఇది కూడా చూడండి: ఫోర్డ్ ఫిగో పూర్తి వివరాలు
9. మారుతి ఆల్టో
గడచిన ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ఆల్టో అమ్మకాలు భారీగా క్షీణించాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 24 శాతం క్షీణించాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 20,858 ఆల్టో కార్లను ఎగుమతి చేసింది.
ఇది కూడా చూడండి: మారుతి ఆల్టో పూర్తి వివరాలు
10. హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ అందిస్తున్న చిన్న కారు ఇయాన్ ఈ జాబితాలో పదవ స్థానంలో ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, గడచిన మార్చ్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ఎగుమతులు 7 శాతం క్షీణించాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 19,296 ఇయాన్ కార్లను ఎగుమతి చేసింది.
ఇది కూడా చూడండి: హ్యుందాయ్ ఇయాన్ పూర్తి వివరాలు

Click it and Unblock the Notifications








