కొత్త స్కొడా ఆక్టావియాను కొనడానికి టాప్ 10 కారణాలు
స్కొడా ఇండియా ఇటీవలే తమ సరికొత్త 2013 ఆక్టావియా సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో ఈ అప్‌గ్రేడెడ్ ఆక్టావియా సెడాన్ ప్రారంభ ధర రూ.13.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
కొత్త 2013 స్కొడా ఆక్టావియా మూడు వేరియంట్లలో (యాక్టివ్, యాంబిషన్, ఎలిగాన్స్), పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో (1.4 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్) లభ్యమవుతుంది.
ఇందులో 1.4 లీటర్ పెట్రోల్ వెర్షన్ కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అలాగే 1.8 లీటర్ పెట్రోల్ వెర్షన్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కాగా, 2.0 లీటర్ డీజిల్ వెర్షన్ మాత్రం మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ఆప్షన్‌తో లభిస్తుంది.
అయితే, 2013 స్కొడా ఆక్టావియా సెడాన్ కొనుగోలు చేయటానికి 10 ప్రధాన కారణాలు ఏంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

బైజెనాన్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డే లైట్ ఫంక్షన్
స్టాండర్డ్ కన్సోల్‌తో పోల్చుకుంటే, బైజెనాన్ హెడ్‌ల్యాంప్స్ మంచి కాంతిని అందించడమే కాకుండా, మంచి స్టయిలింగ్‌ను కలిగి ఉంటాయి. దీనికి అదనంగా జోడించిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ రాత్రివేళల్లో మరింత సేఫ్టీని అందించడమే కాకుండా, మంచి విజిబిలిటీని కూడా కల్పిస్తాయి.

ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ పానరోమిక్ సన్‌రూఫ్
కొత్త 2013 ఆక్టావియా సెడాన్‌లో పానరోమిక్ సన్‌రూఫ్‌ను జోడించారు. ఈ ధృడమైన గ్లాస్ సన్‌రూఫ్ బ్లాక్ కలర్‌లో టింట్ చేయబడి ఉంటుంది. ఈ సన్‌రూఫ్‌ను యాంత్రికంగా కంట్రోల్ చేసుకోవచ్చు.

స్కొడా ఆడియో ప్లేయర్
కొత్త ఆక్టావియాలో 5.8 ఇంచ్ టిఎఫ్‍టి కలర్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో కూడిన ఫుల్లీ లోడెడ్ స్కొడా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది ఎస్‌డి/ఎమ్ఎమ్‌సి కార్డ్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ పోర్ట్‌లను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్ ద్వారా కూడా సంగీతాన్ని వినొచ్చు. ఇందులో మొత్తం 8-స్పీకర్లు ఉంటాయి.

ఆరు ఎయిర్‌బ్యాగ్స్
ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్టులతో కూడిన ప్యాసింజర్ క్యాబిన్ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. కొత్త ఆక్టావియాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇవి క్యాబిన్‌లోని ప్యాసింజర్లకు ఆల్-రౌండ్ ప్రొటెక్షన్‌ను అందిస్తాయి. ఇందులో రెండు ఎయిర్‌బ్యాగ్స్ ముందు వైపు (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం) ఉంటాయి. మిగిలిన నాలుగు ఎయిర్‌బ్యాగ్స్ కారు లోపల ఇరువైపులా ఉండి, సైడ్ ఇంపాక్ట్ నుంచి ప్రయాణికులను రక్షిస్తాయి.

ఆటోమేటిక్ వైపర్, లైటింగ్ సిస్టమ్
కొత్త స్కొడా ఆక్టావియాలో స్మార్ట్ సెన్సార్లను ఉపయోగించారు. వర్షం పడటాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే వైపర్లు (రెయిన్ సెన్సింగ్ వైపర్స్), సూర్యకాంతి తగ్గటాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే హెడ్‌లైట్స్ (ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్) ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు.

పార్క్‌ట్రానిక్ - పార్కింగ్ అసిస్ట్
కొత్త ఆక్టావియాలో ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లను అమర్చారు. ఈ సెన్సార్లు ఆడియో వార్నింగ్ సిగ్నల్స్‌ను జనరేట్ చేస్తాయి. ఈ పార్క్‌ట్రానిక్ పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ ద్వారా కారును సురక్షితంగా పార్క్ చేసే అవకాశం ఉంటుంది.

ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, మెమరీ ఫంక్షన్
కొత్త అక్టావియాలోని డ్రైవర్ సీటును 12 రకాలుగా యాంత్రికంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా డ్రైవర్‌కు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకున్న సీట్ పొజిషన్‌ను మెమరీ ఫంక్షన్ ద్వారా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మూడు సీటింగ్ పొజిషన్‌లను స్టోర్ చేసుకోవచ్చు.

టైర్ ప్రెజర్ మోనిటర్
కొత్త ఆక్టావియా టైర్లలోని గాలి తగ్గినట్లయితే, ఇందులోని టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా అలెర్ట్ చేస్తుంది. ఈ వార్నింగ్‌ను గుర్తించి, కారు టైర్లలో తగిన గాలిని నింపుకున్నట్లయితే పంక్చర్లు అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఇది సేఫ్టీ ఫీచరే కాకుండా, టైర్ల జీవితకాలాన్ని పెంచేందుకు కూడా సహకరిస్తుంది.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈసిఎస్)
క్లిష్ట పరిస్థితుల్లో కారును ఆటోమేటిక్ కంట్రోల్ చేయటంలో ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్ డ్రైవర్‌కు సహకరిస్తుంది. రోడ్డుపై నుంచి వాహనం జారిపోతున్నప్పుడు ఈసిఎస్ ఫీచర్ కారులోని ఏబిఎస్, ఎమ్‌కెబి టెక్నాలజీల సాయాన్ని తీసుకొని, కారు జారిపోకుండా చేస్తుంది.

డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
కొత్త ఆక్టావియాలోని డ్యూయెల్-జోన్ క్లైమాట్రానిక్ ఎయిర్ కండిషనర్ డ్రైవర్, ప్యాసింజర్లు తమకు తగిన విధంగా టెంపరేచర్‌ను సెట్ చేసుకునేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా, ఈ కారులో వెనుక సీటులోని కూర్చునే ప్రయాణికుల కోసం కూడా రెండు ఎసి వెంట్స్ ఉంటాయి.



Click it and Unblock the Notifications








