నవంబర్ 2014లో అమ్ముడైన టాప్ 10 కార్ మోడల్స్
ఇయర్ ఎండ్ సందర్భంగా కార్ కంపెనీలు అమ్మకాల లక్ష్యాలను చేరుకునేందుకు, పాత వాహనాల స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు తమ ఉత్పత్తులపై ఆకర్షనీయమైన ఆఫర్లు ప్రకటించడంతో, దీనికి తోడు అనేక కార్ కంపెనీ తమ సరికొత్త వాహనాలను మార్కెట్లో విడుదల చేయటంతో నవంబర్ 2014 నెలలో కార్ల అమ్మకాలు మిశ్రమ స్పందనను కనబరిచాయి.
ఏదేమైనప్పటికీ, ఇంధన ధరలు, వడ్డీ రేట్ల, ద్రవ్యోల్బణం వంటి పలు అంశాలు మాత్రం ఇంకా కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయని చెప్పాలి. కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు తయారీదారులు, డీలర్లు పలు ప్రత్యేకమైన ఆఫర్లను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నప్పటికీ, అవి వినియోగదారులపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి.
సరే ఇదంతా అటుంచి గడచిన నవంబర్ 2014 నెలలో అమ్ముడైన టాప్ 10 కార్ మోడళ్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

తర్వాతి స్లైడ్‌లలో నవంబర్ 2014 నెలలో అమ్ముడుపోయిన టాప్ 10 కార్లను పరిశీలించండి.

10. సెలెరియో
మారుతి సుజుకి తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన మరో చిన్న కారు సెలెరియో కస్టమర్లను చక్కగా ఆకట్టుకుంటోంది. గడచిన నవంబర్ 2014 నెలలో మొత్తం 4,926 సెలెరియో కార్లు అమ్ముడుపోయాయి.

9. సియాజ్
అక్టోబర్ 2014తో పోల్చుకుంటే నవంబర్ 2014లో మారుతి సుజుకి సియాజ్ అమ్మకాలు స్వల్పంగా తగ్గముఖం పట్టాయి. గడచిన నవంబర్ 2014లో మొత్తం 5,232 యూనిట్ల మారుతి సుజుకి సియాజ్ కార్లు అమ్ముడుపోయాయి.

8. ఇయాన్
ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ అందిస్తున్న చిన్న కారు ఇయాన్. గడచిన అక్టోబర్ నెలలో 6,986 యూనిట్ల ఇయాన్ కార్లు అమ్ముడుపోగా, నవంబర్ 2014లో 6,626 యూనిట్ల ఇయాన్ కార్లు అమ్ముడుపోయాయి.

7. హోండా సిటీ
గడచిన అక్టోబర్ నెలతో పోల్చుకుంటే, నవంబర్ నెలలో హోండా సిటీ అమ్మకాలు స్వల్పంగా వృద్ధి చెందాయి. గడచిన అక్టోబర్ నెలలో 5,120 యూనిట్లుగా ఉన్న సిటీ అమ్మకాలు నవంబర్ నెలలో 7,252 యూనిట్లకు పెరిగాయి.

6. గ్రాండ్ ఐ10
ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్. గడచిన నవంబర్ నెలలో మొత్తం 8,396 యూనిట్ల గ్రాండ్ ఐ10 కార్లు అమ్ముడుపోయాయి. గడచిన సంవత్సరంలో ఈ మోడల్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2014 అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసినదే.

5. ఎలైట్ ఐ20
హ్యుందాయ్ కొత్తగా ప్రవేశపెట్టిన ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన నవంబర్ 2014 నెలలో మొత్తం 10,552 యూనిట్ల ఎలైట్ ఐ20 కార్లు అమ్ముడుపోయాయి. ఈ మోడల్ ఇటీవలే ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2015 అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసినదే.

4. స్విఫ్ట్ డిజైర్
మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడచిన నవంబర్ 2014 నెలలో మొత్తం 12,020 యూనిట్ల మారుతి సుజుకి స్విఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

3. వ్యాగన్ఆర్
ఎప్పుడూ నాలుగైదు స్థానాల్లో ఉండే వ్యాగన్ఆర్ ఈసారి ఈ జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. గడచిన నవంబర్ 2014 నెలలో మొత్తం 13,545 యూనిట్ల మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడుపోయాయి.

2. స్విఫ్ట్
మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన నవంబర్ 2014 నెలలో మొత్తం 17,900 స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో విఫలమైనా, ఈ మోడల్ మంచి ఆదరణనే పొందుతోంది.

1. ఆల్టో
కొత్త ఆల్టో కె10 విడుదలతో గడచిన నెలలో మారుతి సుజుకి ఆల్టో మోడల్ అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ఆల్టో మోడల్ అమ్మకాలు గడచిన నెలలో 24,201 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications








