రూ.5 లక్షలకు దిగువన లభ్యమయ్యే టాప్ 10 స్మాల్ కార్స్

By Ravi

ఒకప్పుడు కారు అంటే సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే రవాణా సాధనం. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా కార్లు రూపాంతం చెందాయి. ప్రజల ఆర్థికాభివృద్ధి మెరుగు పడుతుండటం, కొత్త కొత్త ఆటోమొబైల్ కంపెనీలు ఇండియాలోకి ప్రవేశిస్తుండటంతో అత్యంత సరసమైన ధరకే కార్లు అందుబాటులోకి వచ్చాయి.

వేగంగా అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం కార్ కంపెనీలకు అడ్డాగా మారిపోతోంది. మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా అనేక కార్ కంపెనీలు బడ్జెట్ ధరకే కార్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. సామాన్యుల నుంచి ధనికుల వరకూ వివిధ శ్రేణులలో కార్లు అందుబాటులో ఉన్నాయి.

మరి ఈ కథనంలో రూ.5 లక్షలకు దిగువన అందుబాటులో ఉన్న బడ్జెట్ కార్ల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

రూ.5 లక్షలకు దిగువన టాప్ 10 స్మాల్ కార్స్

తర్వాతి స్లైడ్లలో రూ.5 లక్షలకు దిగువన లభించే టాప్ 10 కార్ల వివరాలను తెలుసుకోండి.

10. నిస్సాన్ మైక్రా యాక్టివ్

10. నిస్సాన్ మైక్రా యాక్టివ్

ధరలు: రూ.4.13 లక్షలు - రూ.4.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్నది నిస్సాన్ మైక్రా యాక్టివ్. ఇది కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. రెగ్యులర్ నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన ఈ మోడల్‌ను విక్రయిస్తున్నారు. ఈ కారులో 1198సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో 251 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 19.49 కెఎంపిఎల్

9. షెవర్లే బీట్

9. షెవర్లే బీట్

ధరలు: రూ.3.97 లక్షలు - రూ.4.92 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నది షెవర్లే బీట్. ఇది పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి వెర్షన్‌లో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 4-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 79 బిహెచ్‌పిల శక్తిని, 108 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 3-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 58 బిహెచ్‌పిల శక్తిని, 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ కారులో 170 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 18.60 కెఎంపిఎల్ (పెట్రోల్)

ఏఆర్ఏఐ మైలేజ్: 25.44 కెఎంపిఎల్ (డీజిల్)

8. హోండా బ్రియో

8. హోండా బ్రియో

ధరలు: రూ.4.00 లక్షలు - రూ.4.94 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నది హోండా బ్రియో. ఇది కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కారులో 1198సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 87 బిహెచ్‌పిల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో 175 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 18.9 కెఎంపిఎల్

7. హ్యుందాయ్ ఐ10

7. హ్యుందాయ్ ఐ10

ధరలు: రూ.3.99 లక్షలు - రూ.4.78 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ ఐ10. ఇది కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కారులో 1086సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పిల శక్తిని, 99 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 225 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 19.81 కెఎంపిఎల్

6. మారుతి సెలెరియో

6. మారుతి సెలెరియో

ధరలు: రూ.3.76 లక్షలు - రూ.4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 6వ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఇటీవలే విడుదల చేసిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్. ప్రస్తుతం ఇది పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కారులో 998సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 235 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 23.1 కెఎంపిఎల్

5. మారుతి వ్యాగన్ఆర్

5. మారుతి వ్యాగన్ఆర్

ధరలు: రూ.3.49 లక్షలు - రూ.4.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఇది పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కారులో 998సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో 180 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 20.51 కెఎంపిఎల్

4. డాట్సన్ గో

4. డాట్సన్ గో

ధరలు: రూ.3.12 లక్షలు - రూ.3.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నది డాట్సన్ గో. ఇది పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కారులో 1198సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో 265 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 20.63 కెఎంపిఎల్

3. హ్యుందాయ్ ఇయాన్

3. హ్యుందాయ్ ఇయాన్

ధరలు: రూ.3.16 లక్షలు - రూ.4.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ ఇయాన్. ఇది పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కారులో 814సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 55 బిహెచ్‌పిల శక్తిని, 75 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో 215 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 21.1 కెఎంపిఎల్

2. మారుతి ఆల్టో 800

2. మారుతి ఆల్టో 800

ధరలు: రూ.3.08 లక్షలు - రూ.3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్నది మారుతి ఆల్టో 800. ఇది పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కారులో 796సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 48 బిహెచ్‌పిల శక్తిని, 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో 177 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 22.7 కెఎంపిఎల్

1. టాటా నానో

1. టాటా నానో

ధరలు: రూ.1.94 లక్షలు - రూ.2.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నది టాటా నానో. ఇది పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కారులో 624సీసీ, 2-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38 బిహెచ్‌పిల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో 80 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

ఏఆర్ఏఐ మైలేజ్: 25.4 కెఎంపిఎల్

More from DriveSpark

Article Published On: Monday, January 5, 2015, 10:12 [IST]
English summary
A long time ago, cars were something exclusively for the wealthy people. Times are changing now and carmakers are making more affordable cars so everybody has a chance to own one. In spite of so many different cars being offered, people who want to chose a car for the first time or looking for a car below INR 5 lakhs need the most help.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+