ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడయ్యే చిన్న కారు 'మారుతి ఆల్టో'

భారతదేశపు ఫేవరేట్ కారు మారుతి ఆల్టో మరోసారి ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడయ్యే చిన్న కారుగా నిలిచింది. దాదాపు దశాబ్ధ కాలంగా భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడువుతున్న చిన్న కారుగా అగస్థానంలో ఉన్న ఆల్టో కారు, 2010లో తొలిసారిగా ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఈ రికార్డును సృష్టించింది. ఆ తర్వాత తిరిగి 2013లో మారుతి ఆల్టో ఈ రికార్డును సొంతం చేసుకుంది.

కాగా.. తాజాగా 2014లో కూడా మారుతి ఆల్టో ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడయ్యే చిన్న కారుగా మరోసారి ఈ రికార్డును కైవసం చేసుకుంది. ఈ సెగ్మెంట్లో ఇది 2014 సంవత్సరంలో ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్, దైహస్తు టాంటో, టొయోటా ఆక్వా, హోండా ఫిట్ వంటి మోడళ్ల కన్నా అత్యధికంగా అమ్మడుపోయింది.

గడచిన 2014 సంవత్సరంలో ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు ఏవో ఓ లుక్కేద్దాం రండి..!

2014లో టాప్10 స్మాల్ కార్స్

తర్వాతి స్లైడ్‌లలో 2014లో ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల వివరాలను తెలుసుకోండి.

10. సుజుకి వ్యాగన్ఆర్

10. సుజుకి వ్యాగన్ఆర్

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 10వ స్థానంలో ఉన్నది సుజుకి వ్యాగన్ఆర్ (జపనీస్ వెర్షన్). భారత మార్కెట్లో ఈ మోడల్ స్టింగ్‌రే పేరుతో అమ్ముడవుతోంది. గత 2014లో సుజుకి మోటార్ కార్పోరేషన్ జపాన్‌లో మొత్తం 1,75,369 వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది.

9. హోండా ఎన్-బాక్స్

9. హోండా ఎన్-బాక్స్

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నది హోండా ఎన్-బాక్స్. ఈ మోడల్ జపాన్ మార్కెట్లో మాత్రమే అమ్ముడుపోతోంది. గత 2014లో హోండా మోటార్ కార్పోరేషన్ జపాన్‌లో మొత్తం 1,79,930 ఎన్-బాక్స్ కార్లను విక్రయించింది.

8. ఫోక్స్‌‌వ్యాగన్ గోల్

8. ఫోక్స్‌‌వ్యాగన్ గోల్

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నది ఫోక్స్‌వ్యాగన్ గోల్. భారత మార్కెట్లో ఈ మోడల్ పోలో పేరుతో అమ్ముడవుతోంది. గత 2014లో ఫోక్స్‌వ్యాగన్ బ్రెజిల్ మార్కెట్లో మొత్తం 1,83,366 గోల్ కార్లను విక్రయించింది.

7. ఫియట్ పుంటో

7. ఫియట్ పుంటో

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 7వ స్థానంలో ఉన్నది ఫియట్ పుంటో. భారత మార్కెట్లో కూడా ఈ మోడల్ పుంటో పేరుతోనే అమ్ముడవుతోంది. గత 2014లో ఫియట్ బ్రెజిల్ మార్కెట్లో మొత్తం 1,83,745 పుంటో కార్లను విక్రయించింది.

6. మారుతి స్విఫ్ట్

6. మారుతి స్విఫ్ట్

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 6వ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి స్విఫ్ట్. గడచిన 2014 సంవత్సరంలో మారుతి సుజుకి భారత మార్కెట్లో మొత్తం 2,02,831 స్విఫ్ట్ కార్లను విక్రయించింది.

5. హోండా ఫిట్

5. హోండా ఫిట్

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నది హోండా స్విఫ్ట్. భారత్‌లో ఇది హోండా జాజ్ పేరుతో అమ్ముడయ్యేది, త్వరలోనే ఇందులో కొత్త వెర్షన్ భారత్‌కు రానుంది. కాగా.. గడచిన 2014లో హోండా మోటార్ కార్పోరేషన్ జపాన్ మార్కెట్లో మొత్తం 2,02,838 ఫిట్ కార్లను విక్రయించింది.

4. టొయోటా ఆక్వా

4. టొయోటా ఆక్వా

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నది టొయోటా ఆక్వా. గత 2014లో టొయోటా మోటార్ కార్పోరేషన్ జపాన్ మార్కెట్లో మొత్తం 2,33,209 ఆక్వా కార్లను విక్రయించింది.

3. దైహస్తు టాంటో

3. దైహస్తు టాంటో

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నది దైహస్తు టాంటో. గత 2014లో దైహస్తు జపాన్ మార్కెట్లో మొత్తం 2,34,456 టాంటో కార్లను విక్రయించింది.

2. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్

2. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో 2వ స్థానంలో ఉన్నది ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్. గత 2014లో ఫోక్స్‌వ్యాగన్ జర్మనీ మార్కెట్లో మొత్తం 2,55,044 గోల్ఫ్ కార్లను విక్రయించింది.

1. మారుతి సుజుకి ఆల్టో

1. మారుతి సుజుకి ఆల్టో

ఇకపోతే.. ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్10 కార్ల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఆల్టో. గత 2014లో మారుతి సుజుకి భారత మార్కెట్లో మొత్తం 2,64,544 ఆల్టో కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం (2013)లో 2,65,277 ఆల్టో కార్లను విక్రయించి, అప్పుడు కూడా ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న కారుగా నిలిచింది.

Most Read Articles

English summary
Maruti Suzuki's best-selling car Alto, has again emerged as the largest-selling small car in the world in 2014 beating the likes of Volkswagen Golf in Germany and Daihatsu Tanto, Toyota Aqua and Honda Fit in Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X