జులై 2013 నెలలో 'టాప్ 20' కార్లు ఇవే..
గడచిన కొద్ది నెలలుగా భారత ఆటోమొబైల్ పరిశ్రమలో మొత్తం కార్ల అమ్మకాలు మందకొడిగా సాగుతున్న సంగతి తెలిసినదే. అయితే, ఇందులో కొన్నిరకాల మోడళ్లు, తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఉత్పత్తల మోడళ్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
మొత్తమ్మీద జులై 2013 నెలలో కార్ల అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లోను కొన్ని కంపెనీలు ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకోగా మరికొన్ని నిరుత్సాహకర అమ్మకాలను నమోదు చేశాయి.
ముందుగా గడచిన నెల హైలైట్స్ పరిశీలిస్తే..
- గడచిన మే నెలలో తొలిసారిగా ద్వితీయ స్థానానికి పడిపోయిన ఆల్టో, ఇప్పుడు మళ్లీ జులైలో ప్రథమ స్థానంలో నిలిచింది.
- గడచిన మే నెలలో తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచిన స్విఫ్ట్ డిజైర్, జులై నెలలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
- అమ్మకాల పరంగా టాప్ 4 మోడళ్లు మారుతి సుజుకి కంపెనీకి చెందినవే కావటం విశేషం.
- తాజాగా వచ్చిన హోండా అమేజ్ 8వ స్థానంలో నిలిచింది.
- అమ్మకాల పరంగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 10వ స్థానంలో ఉంది.
- రెనో డస్టర్‌కు మహీంద్రా స్కార్పియో గట్టి పోటీనిస్తూ, దానికన్నా ముందు స్థానంలో ఉంది.
- మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా నానోలు ఈ టాప్ 20లో లేవు.
జులై 2013 నెలలో అమ్ముడైన టాప్ 20 కార్ మోడళ్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి:

మారుతి సుజుకి ఆల్టో
మారుతి సుజుకి ఎవర్‌గ్రీన్ మోడల్ ఆల్టో తిరిగి తన అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. గడచిన మే నెలలో ద్వితీయ స్థానానికి పడిపోయిన ఆల్టో జులై నెలలో మొత్తం 18,206 యూనిట్లు అమ్ముడుపోవటంతో ప్రథమ స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
గడచిన జులై నెలలో మారుతి సుజుకి మొత్తం 15,249 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌లను విక్రయించింది. ఈ జాబితాలో స్విఫ్ట్ డిజైర్‌ది ద్వితీయ స్థానం.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్
ఈ టాప్ 20 కార్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న మోడల్ కూడా మారుతి సుజుకికి చెందినదే. మే 2013 నెలలో కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ 13,409 యూనిట్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి ఇండియా నుంచి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ద్వితీయం స్థానంలో కొనసాగిన ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు నాల్గన స్థానానికి పడిపోయింది. గడచిన నెలలో కంపెనీ 10,461 స్విఫ్ట్ కార్లను విక్రయించింది.

మహీంద్రా బొలెరో
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ బొలెరో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచిన మహీంద్రా బొలెరో గడచిన నెలలో 6,955 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

హ్యుందాయ్ ఇయాన్
మహీంద్రా బొలెరో తర్వాతి స్థానంలో హ్యుందాయ్ ఇయాన్ (6వ స్థానంలో) నిలిచింది. గడచిన జులై నెలలో హ్యుందాయ్ మొత్తం 6,946 ఇయాన్ కార్లను విక్రయించింది.

హ్యుందాయ్ ఐ10
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ ఐ10 గడచిన జులై 2013 నెలలో మొత్తం 6,735 యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది.

హోండా అమేజ్
లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిందన్నట్లు, గడచిన ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి ప్రవేశించిన హోండా అమేజ్ సెడాన్ మే 2013 నెలలో 6,515 కొనుగోలుదారులను సొంతం చేసుకుంది. ఈ జాబితాలో అమేజ్‌ది 8వ స్థానం.

హ్యుందాయ్ ఐ20
హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20 గడచిన నెలలో 5,366 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్
టాప్ 20 కార్ల జాబితాలో తాజాగా వచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 10వ స్థానంలో నిలిచింది. జులై 2013లో మొత్తం 4,715 యూనిట్ల ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

టొయోటా ఇన్నోవా
జపనీస్ కార్ కంపెనీ టొయోటా అందిస్తున్న బెస్ట్ ఎమ్‌పివి ఇన్నోవా సేల్స్ కూడా తగ్గాయి. ఎమ్‌పివి సెగ్మెంట్లో పోటీ పెరగడంతో ఈ మోడల్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. జులై 2013 నెలలో 4,677 యూనిట్ల ఇన్నోవాలు అమ్ముడయ్యాయి.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి అమ్మకాలు క్రమంగా తగ్గతూ వస్తున్నాయి. గడచిన నెలలో కేవలం 4,562 ఎర్టిగా ఎమ్‌పివిలు మాత్రమే అమ్ముడయ్యాయి.

టాటా ఇండికా ఫ్యామిలీ
గడచిన నెలలో దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా రేంజ్ కార్లు అన్నీ కలిపి 4,276 యూనిట్లుగా నమోదయ్యాయి.

మారుతి సుజుకి ఓమ్నీ
గడచిన నెలలో 4,214 మారుతి సుజుకి ఓమ్నీలు సేల్ అయ్యాయి.

హ్యుందాయ్ వెర్నా
జులై 2013లో హ్యుందాయ్ అందిస్తున్న సి సెగ్మెంట్ సెడాన్ వెర్నా అమ్మకాలు 3,479 యూనిట్లుగా నమోదయ్యాయి.

మారుతి ఈకో
గడచిన నెలలో 3,329 మారుతి సుజుకి ఈకోలు సేల్ అయ్యాయి.

మహీంద్రా స్కార్పియో
మహీంద్రా అందిస్తున్న బెస్ట్ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ స్కార్పియో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడచిన జులై 2013 నెలలో మొత్తం 3,256 స్కార్పియోలు అమ్ముడయ్యాయి.

రెనో డస్టర్
పోర్డ్ ఈకోస్పోర్ట్ రాకతో ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న డస్టర్ ఎస్‌యూవీ జోరు భారీగాతగ్గిందనే చెప్పాలి. గడచిన నెలలో కేవలం 3,089 రెనో డస్టర్ ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ శాంత్రో
ఇయాన్ రాకతో హ్యుందాయ్ అందిస్తున్న చిన్న కారు శాంత్రో అమ్మకాలు కూడా క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. జులై 2013 నెలలో కేవలం 2,961 శాంత్రో కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

టొయోటా ఎతియోస్
జులై 2013 నెలలో టొయోటా అందిస్తున్న ఎతియోస్ రేంజ్ అమ్మకాలు 2,680 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications








