మే 2013లో టాప్ 20 కార్ మోడళ్లు ఇవే..
గడచిన నెలలో ఆటోమొబైల్ పరిశ్రమ మిశ్రమ ఫలితాలను కనబరించింది. ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లోను కొన్ని కంపెనీలు ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకోగా మరికొన్ని నిరుత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, మే 2013 నెలలో అమ్ముడైన టాప్ 20 కార్ మోడళ్ల గురించి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
ముందుగా గడచిన నెల హైలైట్స్ పరిశీలిస్తే..
- మారుతి సుజుకి స్విఫ్ట్ మొట్టమొదటి సారిగా అమ్మకాల్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.
- అలాగే మొట్టమొదటిసారిగా అమ్మకాల్లో ప్రథమ స్థానంలో ఉన్న మారుతి ఆల్టో ద్వితీయ స్థానానికి పడిపోయింది.
- అమ్మకాల్లో టాప్ 4 మోడల్స్ మారుతి సుజుకికి చెందినవే.
- తాజాగా వచ్చిన హోండా అమేజ్ 8వ స్థానంలో నిలిచింది.
- రెనో డస్టర్‌కు మహీంద్రా స్కార్పియో గట్టి పోటీనిస్తూ, దానికన్నా ముందు స్థానంలో ఉంది.
- మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా నానోలు ఈ టాప్ 20 కార్ మోడల్ల జాబితాలోనే లేవు.

గడచిన నెలలో మారుతి సుజుకి మొత్తం 17,265 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌లను విక్రయించింది. ఈ జాబితాలో స్విఫ్ట్ డిజైర్‌దే అగ్రస్థానం. మొట్టమొదటి సారిగా మారుతి స్విఫ్ట్ డిజైర్ కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఆల్టో కారును ఓవర్‌టేక్ చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి ఎవర్‌గ్రీన్ మోడల్ ఆల్టో ఇప్పుడు ద్వితీయ స్థానానికి దిగజారిపోయింది. మే 2013లో కంపెనీ మొత్తం 16,411 ఆల్టో కార్లను విక్రయించింది. మారుతి ఆల్టో ఇలా ద్వితీయ స్థానానికి రావటం ఇదే మొట్టమొదటి సారి.

మారుతి సుజుకి ఇండియా నుంచి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ద్వితీయం స్థానంలో ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు తృతీయ స్థానానికి పడిపోయింది. గడచిన నెలలో కంపెనీ 14,353 స్విఫ్ట్ కార్లను విక్రయించింది.

ఈ టాప్ 20 కార్ల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న మోడల్ కూడా మారుతి సుజుకికి చెందినదే. మే 2013 నెలలో కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ 12,952 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ బొలెరో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచిన మహీంద్రా బొలెరో గడచిన నెలలో 9,780 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ ఐ10 గడచిన మే 2013 నెలలో మొత్తం 8,469 యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది.

హ్యుందాయ్ ఐ10 తర్వాతి స్థానంలో హ్యుందాయ్ ఇయాన్ (7వ స్థానంలో) నిలిచింది. గడచిన మే నెలలో హ్యుందాయ్ మొత్తం 8,406 ఇయాన్ కార్లను విక్రయించింది.

లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిందన్నట్లు, గడచిన ఏప్రిల్ నెలలో మార్కెట్లోకి ప్రవేశించిన హోండా అమేజ్ సెడాన్ మే 2013 నెలలో 6,036 కొనుగోలుదారులను సొంతం చేసుకుంది. ఈ జాబితాలో అమేజ్‌ది 8వ స్థానం.

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20 గడచిన నెలలో 5,701 యూనిట్లు అమ్ముడుపోయాయి.

గడచిన నెలలో దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా రేంజ్ కార్లు అన్నీ కలిపి 5,500 యూనిట్లుగా నమోదయ్యాయి.

మహీంద్రా అందిస్తున్న బెస్ట్ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ స్కార్పియో అమ్మకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. గడచిన మే 2013 నెలలో మొత్తం 5,165 స్కార్పియోలు అమ్ముడయ్యాయి.

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న డస్టర్ ఎస్‌యూవీ జోరు కాస్తంత తగ్గిందనే చెప్పాలి. గడచిన నెలలో 5,146 రెనో డస్టర్ ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడుపోయాయి.

మే 2013లో హ్యుందాయ్ అందిస్తున్న సి సెగ్మెంట్ సెడాన్ వెర్నా అమ్మకాలు 4,710 యూనిట్లుగా నమోదయ్యాయి.

మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి అమ్మకాలు క్రమంగా తగ్గతూ వస్తున్నాయి. గడచిన నెలలో కేవలం 4,306 ఎర్టిగా ఎమ్‌పివిలు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఇయాన్ రాకతో హ్యుందాయ్ అందిస్తున్న చిన్న కారు శాంత్రో అమ్మకాలు కూడా క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. మే 2013 నెలలో కేవలం 4,274 శాంత్రో కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

జపనీస్ కార్ కంపెనీ టొయోటా అందిస్తున్న బెస్ట్ ఎమ్‌పివి ఇన్నోవా సేల్స్ కూడా తగ్గాయి. ఎమ్‌పివి సెగ్మెంట్లో పోటీ పెరగడంతో ఈ మోడల్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. మే 2013 నెలలో 4,216 యూనిట్ల ఇన్నోవాలు అమ్ముడయ్యాయి.

గడచిన నెలలో 4,210 మారుతి సుజుకి ఓమ్నీలు సేల్ అయ్యాయి.

గడచిన నెలలో అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ ఫిగో అమ్మకాలు 3,469 యూనిట్లుగా నమోదయ్యాయి.

హోండా కార్స్ ఇండియా ఇందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సిటీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మే 2013లో మొత్తం 3,202 సిటీ కార్లు అమ్ముడయ్యాయి.

గడచిన నెలలో మొత్తం 2144 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.


Click it and Unblock the Notifications








