నవంబర్ 2013 నెలలో అమ్ముడైన 'టాప్ 20' కార్లు ఇవే!

By Ravi

గడచిన అక్టోబర్ 2013 నెలలో పండుగ సీజన్ నేపథ్యంలో కార్ల అమ్మకాలు ఫర్వాలేదనిపించినప్పటికీ, తిరిగి నవంబర్ 2013 నెలలో మాత్రం పాత పాటనే అందుకున్నాయి. అధిక ఇంధన ధరలు, అందని వడ్డీ రేట్ల, దిగిరాని ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలు భారతదేశంలో కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు తయారీదారులు, డీలర్లు పలు ప్రత్యేకమైన ఆఫర్లను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నప్పటికీ, అవి వినియోగదారులపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి. గడచిన నెలలో దాదాపు అన్ని అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలనే వెల్లడించాయి.

నవంబర్ 2013 నెలలో అమ్ముడైన టాప్ 20 కార్ మోడళ్లేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఎవర్‌గ్రీన్ మోడల్ ఆల్టో ఎప్పటిలాగే నవంబర్ 2013 నెలలో కూడా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. గడచిన నెలలో మొత్తం 23,024 ఆల్టో కార్లు (ఆల్టో 80, ఆల్టో కె10 రెండూ కలిపి) అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్

నవంబర్ 2013 నెలలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు జోరుగానే సాగాయి. గడచిన నెలలో మొత్తం 15,734 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు స్విఫ్ట్ డిజైర్. నవంబర్ 2013 నెలలో మొత్తం 15,286 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ఈ టాప్ 20 కార్ల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న మోడల్ కూడా మారుతి సుజుకికి చెందినదే. నవంబర్ 2013 నెలలో కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ 12,815 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఐ10 గ్రాండ్ ఇటు పెట్రోల్ అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో సరసమైన ధరకే లభిస్తుండటంతో దీని అమ్మకాలు జోరందుకున్నాయి. నవంబర్ నెలలో మొత్తం 11,007 ఐ10 గ్రాండ్ కార్లు అమ్ముడుపోయాయి.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ బొలెరో ఎప్పటి మాదిరిగానే కంపెనీకి ఎవర్‌గ్రీన్ మోడల్‌గా నిలిచింది. నవంబర్ 2013 నెలలో మొత్తం 8,474 బొలెరో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

హోండా అమేజ్

హోండా అమేజ్

డీజిల్ కార్ సెగ్మెంట్లోకి లేట్‌గా వచ్చినప్పటికీ, లేటెస్ట్‌గా వచ్చిన హోండా, తమ అమేజ్ సెడాన్ విడుదలతో మార్కెట్లో మంచి స్పందను దక్కించుకుంది. గడచిన నెలలో మొత్తం 7,598 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ రాకతో హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన నవంబర్ 2013 నెలలో మొత్తం 6340 ఇయాన్ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి సుజుకి ఎర్టిగా

నవంబర్ 2013 నెలలో మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి అమ్మకాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. గడచిన నెలలో మొత్తం 5,840 ఎర్టిగా ఎమ్‌పివిలు అమ్ముడయ్యాయి.

మారుతి సుజుకి ఓమ్నీ

మారుతి సుజుకి ఓమ్నీ

గడచిన నవంబర్ 2013 నెలలో మొత్తం 5,477 మారుతి సుజుకి ఓమ్నీలు సేల్ అయ్యాయి.

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20 గడచిన నెలలో 4,643 యూనిట్లు అమ్ముడుపోయాయి.

టాటా ఇండికా ఫ్యామిలీ

టాటా ఇండికా ఫ్యామిలీ

గడచిన నెలలో దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా రేంజ్ కార్లు అన్నీ కలిపి 4,510 యూనిట్లుగా నమోదయ్యాయి.

టొయోటా ఇన్నోవా

టొయోటా ఇన్నోవా

గడచిన నెలలో టొయోటా ఇన్నోవా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 2013 నెలలో మొత్తం 4,412యూనిట్ల ఇన్నోవాలు అమ్ముడయ్యాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ, గడచిన నవంబర్ 2013లో మొత్తం 4,392 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్ ఐ10

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ ఐ10 గడచిన నవంబర్ 2013 నెలలో మొత్తం 4,094 యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది.

హ్యుందాయ్ శాంత్రో

హ్యుందాయ్ శాంత్రో

గడచిన నవంబర్ 2013 నెలలో మొత్తం 3842 శాంత్రో కార్లు అమ్ముడుపోయాయి.

రెనో డస్టర్

రెనో డస్టర్

పోర్డ్ ఈకోస్పోర్ట్ రాకతో ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న డస్టర్ ఎస్‌యూవీ జోరు భారీగాతగ్గిందనే చెప్పాలి. గడచిన నెలలో మొత్తం 3,624 రెనో డస్టర్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా అందిస్తున్న బెస్ట్ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ స్కార్పియో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడచిన నవంబర్ 2013 నెలలో మొత్తం 3,594 స్కార్పియోలు అమ్ముడయ్యాయి.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'వెర్నా' అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. గడచిన నవంబర్ నెలలో మొత్తం 3,219 హ్యుందాయ్ వెర్నా కార్లు అమ్ముడుపోయాయి.

నిస్సాన్ టెర్రానో

నిస్సాన్ టెర్రానో

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ టెర్రానో కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం దీని అధిక ధరే. గడచిన నెలలో మొత్తం 2,865 నిస్సాన్ టెర్రానోలు అమ్ముడుపోయాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 3, 2013, 11:30 [IST]
English summary
Car makers suffered post-festive season pangs in November with major companies Maruti Suzuki India, Hyundai Motor India, Tata Motors and Mahindra & Mahindra reporting decline in domestic sales. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+