అక్టోబర్ 2013 నెలలో అమ్ముడైన 'టాప్ 20' కార్లు ఇవే!

By Ravi

పండుగ సీజన్‌లో కన్జ్యూమర్ సెంటిమెంట్ పెరగాల్సి ఉన్నప్పటికీ, అధిక ఇంధన ధరలు, అందని వడ్డీ రేట్ల నేపథ్యంలో గడచిన నెలలో కూడా కార్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగాయి. ద్రవ్యోల్బణం, సామాన్యుడికి అందుబాటులోని వాహన రుణాలు, ప్రతినెలా పెరుగుతున్న ఇంధన ధరలు, అస్థిరమైన స్టాక్ మార్కెట్, రూపాయి మారకపు విలువ తదితర అంశాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పెను సవాళ్లుగా మారుతున్నాయి.

ఏదేమైనప్పటికీ, గడచిన అక్టోబర్ నెలలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కార్ల తయారీదారులు, డీలర్లు తమ ఉత్పత్తులపై అందించిన తగ్గింపులు, వివిధ ప్రోత్సాహకాలతో ఇదివరకటి నెలలతో పోల్చుకుంటే అమ్మకాలు ఓ రకంగా మెరుగుపడ్డాయనే చెప్పాలి.

మొత్తమ్మీద చూసుకుంటే అక్టోబర్ 2013 నెలలో కార్ల అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. మరి గడచిన నెలలో అమ్ముడైన టాప్ 20 కార్ మోడళ్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఎవర్‌గ్రీన్ మోడల్ ఆల్టో ఎప్పటిలాగే అక్టోబర్ 2013 నెలలో కూడా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. గడచిన నెలలో మొత్తం 22,574 ఆల్టో కార్లు (ఆల్టో 80, ఆల్టో కె10 రెండూ కలిపి) అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్

పండుగ సీజన్ నేపథ్యంలో, అక్టోబర్ 2013 నెలలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు జోరుగానే సాగాయి. గడచిన నెలలో మొత్తం 19,047 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు స్విఫ్ట్ డిజైర్. అక్టోబర్ 2013 నెలలో మొత్తం 17,211 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ఈ టాప్ 20 కార్ల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న మోడల్ కూడా మారుతి సుజుకికి చెందినదే. అక్టోబర్ 2013 నెలలో కంపెనీ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ 14,270 యూనిట్లు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఐ10 గ్రాండ్ ఇటు పెట్రోల్ అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో సరసమైన ధరకే లభిస్తుండటంతో దీని అమ్మకాలు జోరందుకున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 11,519 ఐ10 గ్రాండ్ కార్లు అమ్ముడుపోయాయి.

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన చీప్ అండ్ బెస్ట్ ఎస్‌యూవీ బొలెరో ఎప్పటి మాదిరిగానే కంపెనీకి ఎవర్‌గ్రీన్ మోడల్‌గా నిలిచింది. అక్టోబర్ 2013 నెలలో మొత్తం 10,705 బొలెరో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

హోండా అమేజ్

హోండా అమేజ్

డీజిల్ కార్ సెగ్మెంట్లోకి లేట్‌గా వచ్చినప్పటికీ, లేటెస్ట్‌గా వచ్చిన హోండా, తమ అమేజ్ సెడాన్ విడుదలతో మార్కెట్లో మంచి స్పందను దక్కించుకుంది. గడచిన నెలలో మొత్తం 9,564 యూనిట్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి సుజుకి ఎర్టిగా

అక్టోబర్ 2013 నెలలో మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి అమ్మకాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. గడచిన నెలలో మొత్తం 7,224 ఎర్టిగా ఎమ్‌పివిలు అమ్ముడయ్యాయి.

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ రాకతో హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన అక్టోబర్ 2013 నెలలో మొత్తం 6867 ఇయాన్ కార్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి ఓమ్నీ

మారుతి సుజుకి ఓమ్నీ

గడచిన అక్టోబర్ 2013 నెలలో మొత్తం 6,547 మారుతి సుజుకి ఓమ్నీలు సేల్ అయ్యాయి.

టొయోటా ఇన్నోవా

టొయోటా ఇన్నోవా

ఫెస్టివ్ సీజన్‌తో టొయోటా ఇన్నోవా అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. అక్టోబర్ 2013 నెలలో మొత్తం 6,099 యూనిట్ల ఇన్నోవాలు అమ్ముడయ్యాయి.

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20 గడచిన నెలలో 6,045 యూనిట్లు అమ్ముడుపోయాయి.

టాటా ఇండికా ఫ్యామిలీ

టాటా ఇండికా ఫ్యామిలీ

గడచిన నెలలో దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా రేంజ్ కార్లు అన్నీ కలిపి 5,346 యూనిట్లుగా నమోదయ్యాయి.

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా అందిస్తున్న బెస్ట్ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ స్కార్పియో అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడచిన అక్టోబర్ 2013 నెలలో మొత్తం 5,230 స్కార్పియోలు అమ్ముడయ్యాయి.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ, గడచిన అక్టోబర్ 2013లో మొత్తం 5113 యూనిట్లు అమ్ముడుపోయాయి.

రెనో డస్టర్

రెనో డస్టర్

పోర్డ్ ఈకోస్పోర్ట్ రాకతో ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న డస్టర్ ఎస్‌యూవీ జోరు భారీగాతగ్గిందనే చెప్పాలి. గడచిన నెలలో మొత్తం 4,657 రెనో డస్టర్ ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా

అక్టోబర్ 2013 నెలలో హ్యుందాయ్ అందిస్తున్న సి సెగ్మెంట్ సెడాన్ వెర్నా అమ్మకాలు 4,549 యూనిట్లుగా నమోదయ్యాయి.

హ్యుందాయ్ ఐ10

హ్యుందాయ్ ఐ10

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ ఐ10 గడచిన అక్టోబర్ 2013 నెలలో మొత్తం 3575 యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది.

టాటా ఇండిగో రేంజ్

టాటా ఇండిగో రేంజ్

గడచిన నెలలో టాటా మోటార్స్ అందిస్తున్న ఇండిగో రేంజ్ (టాటా ఇండిగో, మాంజా) వాహనాల అమ్మకాలు 3,478 యూనిట్లుగా నమోదయ్యాయి.

మారుతి ఈకో

మారుతి ఈకో

గడచిన నెలలో 3,239 మారుతి సుజుకి ఈకోలు సేల్ అయ్యాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 4, 2013, 10:54 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+