టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టికెఎమ్) భారత్‌లో కెల్లా తొలిసారిగా స్థానికంగా ఉత్పత్తి చేసిన హైబ్రిడ్ కారు 'క్యామ్రీ హైబ్రిడ్'ను నేడు (ఆగస్ట్ 28, 2013) దేశీయ విపణిలో విడుదల చేశారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని బిడదిలో ఉన్న టికెఎమ్‌కు చెందిన రెండవ ప్లాంటులో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన అసెంబ్లింగ్ యూనిట్‌లో ఈ సరికొత్త క్యామ్రీ హైబ్రిడ్ కారును ఉత్పత్తి చేయనున్నారు. దీంతో టొయోటాకు ప్రపంచ వ్యాప్తంగా హైబ్రిడ్ వాహనాలను తయారు చేస్తున్న దేశాల సంఖ్య 9కి చేరింది.
టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారును స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నందున, సరసమైన ధరకే ఈ కారును అందించడం సాధ్యమయ్యింది. పెట్రోల్ వెర్షన్ క్యామ్రీని తొలిసారిగా 2002లో టొయోటా భారత్‌కు పరిచయం చేసింది. ఆ తర్వాత 2012లో పెట్రోల్ క్యామ్రీ స్థానిక ఉత్పత్తిని కంపెనీ ప్రారంభించింది. పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఈ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా 7వ తరం క్యామ్రీని ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు.
టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్
క్యామ్రీ హైబ్రిడ్ కారులో 158 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 44 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండు కలిసి గరిష్టంగా 202 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్ (ఈ-విసిటి)తో జతచేయబడి ఉంటుంది.

మైలేజ్
టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారులో జోడించిన ఎలక్ట్రిక్ మోటార్, కారు మైలేజ్‌ను పెంచడంలో సహకరిస్తుంది. హైబ్రిడ్ సైనర్జీ డ్రైవ్ సిస్టమ్ వలన పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ల పవర్ సోర్సెస్‌ను సెన్స్ చేస్తుంది, ఫలితంగా ఇది లీటరు పెట్రోలుకు 19.6 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది కిలోమీటరుకు 122.8 గ్రాముల కర్భన వ్యర్థాలను మాత్రమే విడుదల చేస్తుంది.

35 అధనపు ఫీచర్లు
రెగ్యులర్ పెట్రోల్ వెర్షన్ క్యామ్రీలో లభించే ఫీచర్లతో పోల్చుకుంటే క్యామ్రీ హైబ్రిడ్ కారులో 35 అధనపు ఫీచర్లు లభ్యమవుతాయి. ఇది గ్రే మెటాలిక్, వైట్ పెరల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ అనే రంగులలో లభిస్తుంది.

సెగ్మెంట్లో కెల్లా తొలి లగ్జరీ ఫీచర్లు
* పవర్ రిక్లైన్ రియర్ సీట్స్
* పవర్ రిక్లైన్ రియర్ సీట్ కంట్రోల్స్, రియర్ విండ్‌షీల్డ్ కోసం పవర్ సన్‌షేడ్, ఆడియో సిస్టమ్, ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్స్‌తో కూడిన రియర్ ఆర్మ్‌రెస్ట్.
* 3-జోన్ ఎయిర్ కండిషనింగ్ (కారులో ప్యాసింజర్లు, డ్రైవర్ కోసం ఇండివిడ్యువల్ టెంపరేచర్ కంట్రోల్స్)

ఎక్స్టీరియర్
* హైబ్రిడ్ ఎక్స్‌క్లూజివ్ రేడియేటర్ గ్రిల్, బంపర్, ఫాగ్ ల్యాంప్ బెజెల్
* ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్
* రియర్ ఫాగ్ ల్యాంప్స్
* 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్
* ఆటో ఫోల్డింగ్, రివర్స్ లింక్డ్ ఓఆర్‌విఎమ్‌లు (మెమరీ ఫంక్షన్‌తో)
* హైబ్రిడ్ యాంబ్లం, హెచ్ఎస్‌డి లోగో
* అకౌస్టిక్ గ్లాస్

ఇంటీరియర్
* పవర్ రిక్లైనింగ్ రియర్ సీట్
* 3-జోన్ ఎయిర్ కండిషనర్
* సీట్ వెంటిలేషన్ సిస్టమ్ (ముంద సీట్ల కోసం)
* హైబ్రిడ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటీరియర్ ఆర్నమెంటేషన్, కాంబీమీటర్, హైబ్రిడ్ సిస్టమ్ ఇండికేటర్
* పవర్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కాలమ్ (మెమర్ ఫంక్షన్‌తో)
* డ్రైవర్ సీట్ పొజిషన్ మెమరీ

ఇంటీరియర్
* రియర్ విండ్‌షీల్డ్ కోసం పవర్ సన్‌షేడ్, రియర్ విండోసం కోసం మ్యాన్యువల్ సన్‌షేడ్
* ముందు వైపు ప్యాసింజర్ సీట్ కోసం కొలాప్సబల్ హెడ్‌రెస్ట్
* ఫ్రంట్ సీట్లకు వెనుక వైపు అసిస్ట్ గ్రిప్స్
* ఈసి (ఎలక్ట్రో క్రోమిక్) యాంటీ-గ్లేర్ మిర్రర్
* హై డెన్సిటీ డ్యాష్‌బోర్డ్ సైలెన్సర్ మెటీరియల్
* వెనుక ఆర్మ్ రెస్ట్‌పై యాక్ససరీ కనెక్టర్
* ఆటో పవర్ విండోస్ (అన్ని సీట్లకు)

సేఫ్టీ ఫీచర్స్
* 4 ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
* హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్
* వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్
* ట్రాక్షన్ కంట్రోల్
* బ్యాక్ మోనిటర్స్, కార్నర్ సెన్సార్స్

ధర
* భారత మార్కెట్లో టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారు ధర రూ.29.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








