బ్రెజిల్: టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్ ఆవిష్కరణ

By Ravi

జపాన్ ఆటో దిగ్గజం టొయోటా మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న ఎతియోస్ సిరీస్‌లో అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌లో కంపెనీ ఓ కొత్త వెర్షన్‌ను బ్రెజిల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన క్రాస్ పోలో అలాగే స్కాడా ప్రవేశపెట్టిన ఫ్యాబియా స్కౌట్ మోడళ్ల మాదిరిగానే, టొయోటా తమ ఎతియోస్ హ్యాచ్‌బ్యాక్‌ను డిజైన్ చేసింది.

టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్ పేరిట ఆవిష్కరించిన ఈ మోడల్‌ను క్రాసోవర్ స్టయిల్‌లో ఉండేలా ఎక్స్టీరియర్‌ను రూపొందించారు. రెగ్యులర్ వెర్షన్ ఎతియోస్ హ్యాచ్‌బ్యాక్ కన్నా రగ్గడ్‌గా కనిపించే ఈ ఎతియోస్ క్రాస్ ఎడిషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి..!

టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్

టొయోటా ఎతియో క్రాస్ ఎడిషన్‌లో కొత్త బంపర్‌ను అమర్చారు. ట్రాపేజోడియల్ షేపులో సిల్వర్ ఇన్‌సెర్ట్స్‌తో డిజైన్ చేసిన ఈ బంపర్ మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది. వీల్ అర్చెస్ చుట్టూ అలాగే సైడ్స్‌లో బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను అమర్చారు.

టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్

కొత్త బంపర్స్, సైడ్ సిల్స్‌తో పాటుగా, ఎతియోస్ క్రాస్‌లో కొత్తగా రూఫ్ బార్స్‌ను కూడా జోడించారు. ఈ బార్స్ 50 కిలోల వరకు బరువును మోయగలవు.

టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్

ఇంటీరియర్ మార్పుల విషయానికి వస్తే, కొత్త సీట్ ఫ్యాబ్రిక్స్‌ను జోడించారు. స్పోర్టీయర్ లుక్‌నిచ్చేలా అక్కడక్కడా క్రోమ్ ఇన్‌సెర్ట్స్‌ను అమర్చారు.

టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్

ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 1.5 లీటర్ 96 హెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్ రైడ్ హైట్‌ను మాత్రం కొద్దిగా పెంచారు.

టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్

కానీ, ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో లేకపోవటం కాస్తంత అసంతృప్తికి గురిచేసే అంశం. ఇంజన్ నుంచి ఉత్పత్తి శక్తి ఫైవ్-స్పీడ్ ట్రాన్సిమిషన్ ద్వారా ముందు చక్రాలకు బదిలీ అవుతుంది (రెగ్యులర్ ఎతియోస్ మాదిరిగానే).

టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్

బ్రెజిల్ మార్కెట్లో టొయోటా ఎతియోస్ క్రాస్ నవంబర్ 18 నుంచి లభ్యం కానుంది. అక్కడి మార్కెట్లో దీని ధర 45,690 బ్రెజిలియన్ రియల్. అంటే మన దేశ కరెన్సీలోసుమారు రూ.12.47 లక్షలు. టాప్ ఎండ్ వేరియంట్ (ఎటియోఎస్ ఎక్స్ఎల్ఎస్)లో లభించే అన్ని ఫీచర్లను ఎతియోస్ క్రాస్‌లో కూడా ఆఫర్ చేయనున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, November 8, 2013, 14:41 [IST]
English summary
Toyota Etios, the hatchback and not the sedan, has been given a makeover in Brazil. The same sort which many hatchbacks seem to be getting around the world. We are talking about the Crossover craze of course. Toyota has now got into that game with the Etios Cross Edition. A slightly rugged and raised version of a regular Etios hatchback.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+