హైదరాబాద్‌లో టొయోటా ఎతియోస్ క్రాస్ విడుదల

By Ravi

హైదరాబాద్: టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) గడచిన వారంలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి క్రాసోవర్ 'ఎతియోస్ క్రాస్' (Etios Cross)ను, కంపెనీ ఇప్పుడు నగర వాసులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

టొయోటా ఎతియోస్ క్రాస్ మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో (2 పెట్రోల్, 1 డీజిల్) లభ్యమవుతుంది. రాష్ట్ర విపణిలో పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.5.80 లక్షలుగా ఉంటే, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.7.05 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

ఆంధ్రప్రదేశ్‌లో 18 అవుట్‌లెట్లలో టొయోటా ఎతియోస్ క్రాస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. దేశంలోని టొయోటా కంపెనీ మొత్తం మార్కెట్ విలువ కంటే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ విలువే ఎక్కువగా ఉందని టికెఎమ్ జిఎమ్ ఆర్.కె. రమేష్ తెలిపారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

హైదరాబాద్‌లో టొయోటా ఎతియోస్ క్రాస్ విడుదల

హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీల కలయికే ఈ టొయోటా ఎతియోస్ క్రాస్. ఇది ఎస్‌యూవీ లాంటి రగ్గడ్ లుక్‌ని హ్యాచ్‌బ్యాక్ లాంటి మైలేజీనిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డి-4డి డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. స్టైల్‌ను కోరుకునే నేటి ఆధునిక యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టింది. ఈ కారులోని కీలక ఫీచర్లను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఎక్స్టీరియర్ ఫీచర్లు:

ఎక్స్టీరియర్ ఫీచర్లు:

* బోల్డ్ ఫ్రంట్ గ్రిల్

* సైడ్ క్లాడింగ్

* స్టయిలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్

* స్టర్డీ అండ్ స్టయిలిష్ రూఫ్ రెయిల్స్

* డైనమిక్ రియర్ క్లాడింగ్ విత్ బ్యాడ్జింగ్ అండ్ రూఫ్ స్పాయిలర్

* టర్న్ ఇండికేటర్లతో కూడిన ఫాగ్ ల్యాంప్స్

* టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్

* వైపర్‌తో కూడిన రియర్ డిఫాగ్గర్

ఇంటీరియర్ ఫీచర్లు:

ఇంటీరియర్ ఫీచర్లు:

* పియానో బ్లాక్ ఇంటీరియర్స్

* వైట్ కలర్ స్టిచింగ్, లోగోతో కూడిన స్పోర్టీ సీట్ ఫ్యాబ్రిక్

* 2 డిన్ ఆడియో సిస్టమ్ (బ్లూటూత్, ఆక్స్-ఇన్, యూఎస్‌బి, రిమోట్)

* స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

పెర్ఫార్మెన్స్:

పెర్ఫార్మెన్స్:

* 1.5లీ. పెట్రోల్ - 66KW (90 PS) @ 5600 rpm

* 1.2లీ. పెట్రోల్ - 59KW (80 PS) @ 5600 rpm

* 1.4లీ. డీజిల్ - 50 KW (68 PS) @ 3800 rpm

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్:

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్:

* బెస్ట్ ఇన్ క్లాస్ ఏసి పెర్ఫార్మెన్స్

* ఇండియన్ రోడ్లకు అనువైన సస్పెన్షన్

* డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్

* స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

* రియర్ విండో డిఫాగ్గర్, టాకోమీటర్ విత్ డిజిటల్ క్లాక్

* టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్

సేఫ్టీ అండ్ క్వాలిటీ:

సేఫ్టీ అండ్ క్వాలిటీ:

* ఈబిడితో కూడిన ఏబిఎస్

* కొల్లైజన్ అబ్జార్వింగ్ బాడీ

* డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్

* తుప్పు పట్టకుండా ఉండే నాణ్యమైన స్టీల్

* అండర్ బాడీ కోటింగ్

* యాంటీ చిప్ కోటింగ్

వేరియంట్లు ధరలు:

వేరియంట్లు ధరలు:

ఎతియోస్ క్రాస్ జి (1.2, పెట్రోల్) - రూ.5.81 లక్షలు

ఎతియోస్ క్రాస్ వి (1.5, పెట్రోల్) - రూ.7.46 లక్షలు

ఎతియోస్ క్రాస్ జిడి (1.4, డీజిల్) - రూ.7.05 లక్షలు

ఎతియోస్ క్రాస్ విడి (1.4, డీజిల్) - రూ.7.46 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

కలర్ ఆప్షన్స్:

కలర్ ఆప్షన్స్:

* ఇన్‌ఫెర్నో ఆరెంజ్

* ఆల్ట్రామెరైన్ బ్లూ

* క్లాసిక్ గ్రే

* సింఫనీ సిల్వర్

* సెలెస్టియల్ బ్లాక్

* వైట్

* వెర్మిలియన్ రెడ్

* హార్మనీ బీజ్

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2014, 8:50 [IST]
English summary
Toyota Kirloskar Motor Pvt. Ltd. (TKM) has launched its New Etios Cross in Hyderabad on Sunday. The new vehicle was unveiled, in February, at the 12th Auto Expo, in Greater Noida. The New Etios Cross will further expand the Etios family along with its existing models - Etios & Liva. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+