టొయోటా ఎతియోస్ క్రాస్ విడుదల: ధర, ఫీచర్లు
జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో తమ మొట్టమొదటి క్రాసోవర్ 'ఎతియోస్ క్రాస్' (Etios Cross)ను నేడు (మే 7, 2014) దేశీయ విపణిలో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఇది మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో (2 పెట్రోల్, 1 డీజిల్) లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.5.76 లక్షలు కాగా, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.6.90 లక్షలుగా ఉంది అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ తొలిసారిగా తమ ఎతియోస్ క్రాస్ క్రాసోవర్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఎతియోస్ క్రాస్ ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఎతియోస్ సెడాన్, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌ల సరసన చేరనుంది. బ్రెజిల్ మార్కెట్లో విడుదలైన ఎతియోస్ క్రాస్ క్రాసోవర్ ఇప్పటికే మంచి పాపులర్ అయ్యింది, ఇండియాలో కూడా ఇది అంతే పాపులర్ కాగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీల కలయికే ఈ టొయోటా ఎతియోస్ క్రాస్. ఇది ఎస్‌యూవీ లాంటి రగ్గడ్ లుక్‌ని హ్యాచ్‌బ్యాక్ లాంటి మైలేజీనిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డి-4డి డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. స్టైల్‌ను కోరుకునే నేటి ఆధునిక యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టింది. ఈ కారులోని కీలక ఫీచర్లను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఎక్స్టీరియర్ ఫీచర్లు:
* బోల్డ్ ఫ్రంట్ గ్రిల్
* సైడ్ క్లాడింగ్
* స్టయిలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
* స్టర్డీ అండ్ స్టయిలిష్ రూఫ్ రెయిల్స్
* డైనమిక్ రియర్ క్లాడింగ్ విత్ బ్యాడ్జింగ్ అండ్ రూఫ్ స్పాయిలర్
* టర్న్ ఇండికేటర్లతో కూడిన ఫాగ్ ల్యాంప్స్
* టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్
* వైపర్‌తో కూడిన రియర్ డిఫాగ్గర్

ఇంటీరియర్ ఫీచర్లు:
* పియానో బ్లాక్ ఇంటీరియర్స్
* వైట్ కలర్ స్టిచింగ్, లోగోతో కూడిన స్పోర్టీ సీట్ ఫ్యాబ్రిక్
* 2 డిన్ ఆడియో సిస్టమ్ (బ్లూటూత్, ఆక్స్-ఇన్, యూఎస్‌బి, రిమోట్)
* స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

పెర్ఫార్మెన్స్:
* 1.5లీ. పెట్రోల్ - 66KW (90 PS) @ 5600 rpm
* 1.2లీ. పెట్రోల్ - 59KW (80 PS) @ 5600 rpm
* 1.4లీ. డీజిల్ - 50 KW (68 PS) @ 3800 rpm

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్:
* బెస్ట్ ఇన్ క్లాస్ ఏసి పెర్ఫార్మెన్స్
* ఇండియన్ రోడ్లకు అనువైన సస్పెన్షన్
* డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్
* స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్
* రియర్ విండో డిఫాగ్గర్, టాకోమీటర్ విత్ డిజిటల్ క్లాక్
* టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్

సేఫ్టీ అండ్ క్వాలిటీ:
* ఈబిడితో కూడిన ఏబిఎస్
* కొల్లైజన్ అబ్జార్వింగ్ బాడీ
* డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్
* తుప్పు పట్టకుండా ఉండే నాణ్యమైన స్టీల్
* అండర్ బాడీ కోటింగ్
* యాంటీ చిప్ కోటింగ్

వేరియంట్లు ధరలు:
* ఎతియోస్ క్రాస్ జి (1.2, పెట్రోల్) - రూ.5.76 లక్షలు
* ఎతియోస్ క్రాస్ వి (1.5, పెట్రోల్) - రూ.7.35 లక్షలు
* ఎతియోస్ క్రాస్ జిడి (1.4, డీజిల్) - రూ.6.90 లక్షలు
* ఎతియోస్ క్రాస్ విడి (1.4, డీజిల్) - రూ.7.40 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కలర్ ఆప్షన్స్: ఇన్‌ఫెర్నో ఆరెంజ్
రెగ్యులర్ ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ కన్నా ఎతియోస్ క్రాస్ క్రాసోవర్ 120 మి.మీ పొడవును, 40 మి.మీ. వెడల్పును మరియు 45 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. సైజులో వ్యత్యాసంతో పాటుగా ఈ క్రాసోవర్ చుట్టూ ఉండే ప్లాస్టిక్ క్లాడింగ్ మరింత స్పోర్టీ, ఆఫ్-రోడ్ లుక్‌నిస్తుంది.

కలర్ ఆప్షన్స్: ఆల్ట్రామెరైన్ బ్లూ
టొయోటా ఎతియోస్ క్రాస్ రెగ్యులర్ ఎతియోస్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా కాకుండా మరింత రఫ్ అండ్ టఫ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో సరికొత్త బంపర్‌ను అమర్చారు. ట్రాపేజోడియల్ షేపులో సిల్వర్ ఇన్‌సెర్ట్స్‌తో డిజైన్ చేసిన ఈ బంపర్ మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది. వీల్ అర్చెస్ చుట్టూ అలాగే సైడ్స్‌లో మందంగా ఉండే బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను అమర్చారు.

కలర్ ఆప్షన్స్: క్లాసిక్ గ్రే
కొత్త బంపర్స్, సైడ్ సిల్స్‌తో పాటుగా, ఎతియోస్ క్రాస్‌లో కొత్తగా రూఫ్ బార్స్‌ను కూడా జోడించారు. ఈ బార్స్ 50 కిలోల వరకు బరువును మోయగలవు. టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎతియోస్ క్రాస్ బ్యాడ్జింగ్‌తో కూడిన రియర్ క్లాడింగ్ ఇందులో మరో అదనపు ప్రత్యేకత.

కలర్ ఆప్షన్స్: సింఫనీ సిల్వర్
ఇంటీరియర్ మార్పుల విషయానికి వస్తే, దీని ఇంటీరియర్స్‌ను కొత్త పియానో బ్లాక్ కలర్ థీమ్‌తో డిజైన్ చేశారు. ఇందులో కొత్త సీట్ ఫ్యాబ్రిక్స్‌ను జోడించారు, ఈ సీట్స్‌పై వైట్ కలర్ స్టిచింగ్‌తో చేసిన లోగో ఉంటుంది. స్పోర్టీయర్ లుక్‌నిచ్చేలా అక్కడక్కడా క్రోమ్ ఇన్‌సెర్ట్స్‌ను అమర్చారు. యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి.

కలర్ ఆప్షన్స్: సెలెస్టియల్ బ్లాక్
సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. బెటర్ ఆఫ్ రోడింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం దీని మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్‌ను 170 మి.మీ. లకు పెంచారు. టొయోటా ఎతియోస్ క్రాస్ 1.5 లీటర్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో పాటుగా, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది.

కలర్ ఆప్షన్స్: వైట్
టొయోటా ఎతియోస్ క్రాస్ ఈ సెగ్మెంట్లో నేరుగా ఫోక్స్‌వ్యాగన్ క్రాస్ పోలోకు పోటీగా నిలువనుంది.

కలర్ ఆప్షన్స్:
వెర్మిలియన్ రెడ్

కలర్ ఆప్షన్స్:
హార్మనీ బీజ్


Click it and Unblock the Notifications








