ఆటో ఎక్స్‌పో 2014: టొయోటా ఎతియోస్ క్రాస్ ఆవిష్కరణ
టొయోటా కిర్లోస్కర్ మోటార్ అందిస్తున్న 'టొయోటా ఎతియోస్ లివా' హ్యాచ్‌బ్యాక్‍ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. క్రాసోవర్ అవతారంలో కనిపిస్తున్న ఈ మోడల్ పేరు 'టొయోటా ఎతియోస్ క్రాస్'. రెగ్యులర్ టొయోటా ఎతియోస్ హ్యాచ్‌బ్యాక్ కన్నా ఎంతో భిన్నంగా, రగ్గడ్‌గా కనిపించడం ఈ మోడల్ విశిష్టత.
ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన క్రాస్ పోలో అలాగే స్కాడా ప్రవేశపెట్టిన ఫ్యాబియా స్కౌట్ మోడళ్ల మాదిరిగానే, టొయోటా ఎతియోస్ క్రాస్ కూడా రెగ్యులర్ హ్యాచ్‌బ్యాక్ కన్నా విభిన్నమైన లుక్, డిజైన్‌తో కనిపిస్తుంది. క్రాసోవర్ స్టయిల్‌లో ఉండేలా ఈ మోడల్ ఎక్స్టీరియర్లను కస్టమైజ్ చేశారు.
టొయోటా ఎతియోస్ క్రాస్‌ను తొలిసారిగా గడచిన సంవత్సరం నవంబర్ నెలలో బ్రెజిల్ మార్కెట్లో ఆవిష్కరించారు. ఎతియోస్ క్రాస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టొయోటా ఎతియో క్రాస్‌లో కొత్త బంపర్‌ను అమర్చారు. ట్రాపేజోడియల్ షేపులో సిల్వర్ ఇన్‌సెర్ట్స్‌తో డిజైన్ చేసిన ఈ బంపర్ మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది. వీల్ అర్చెస్ చుట్టూ అలాగే సైడ్స్‌లో బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌ను అమర్చారు.

కొత్త బంపర్స్, సైడ్ సిల్స్‌తో పాటుగా, ఎతియోస్ క్రాస్‌లో కొత్తగా రూఫ్ బార్స్‌ను కూడా జోడించారు. ఈ బార్స్ 50 కిలోల వరకు బరువును మోయగలవు.

ఇంటీరియర్ మార్పుల విషయానికి వస్తే, కొత్త సీట్ ఫ్యాబ్రిక్స్‌ను జోడించారు. స్పోర్టీయర్ లుక్‌నిచ్చేలా అక్కడక్కడా క్రోమ్ ఇన్‌సెర్ట్స్‌ను అమర్చారు.

ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 1.5 లీటర్ 96 హెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, టొయోటా ఎతియోస్ క్రాస్ ఎడిషన్ రైడ్ హైట్‌ను మాత్రం కొద్దిగా పెంచారు.

కానీ, ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో లేకపోవటం కాస్తంత అసంతృప్తికి గురిచేసే అంశం. ఇంజన్ నుంచి ఉత్పత్తి శక్తి ఫైవ్-స్పీడ్ ట్రాన్సిమిషన్ ద్వారా ముందు చక్రాలకు బదిలీ అవుతుంది (రెగ్యులర్ ఎతియోస్ మాదిరిగానే).

టాప్ ఎండ్ వేరియంట్ (ఎటియోఎస్ ఎక్స్ఎల్ఎస్)లో లభించే అన్ని ఫీచర్లను ఎతియోస్ క్రాస్‌లో కూడా ఆఫర్ చేయనున్నారు. దీని ధర, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








