టొయోటా ఎతియోస్, లివా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్

By Ravi

ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్, కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ అందిస్తున్న ఎతియోస్ సెడాన్, లివా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో 'ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్' పేరిట మరిన్ని అదనపు ఫీచర్లు కలిగిన కార్లను టొయోటా అందిస్తోంది.

రెగ్యులర్ వెర్షన్ టొయోటా ఎతియోస్, లివా మోడళ్లతో పోల్చుకుంటే, ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ఎతియోస్, లివా మోడళ్లలో లభ్యమయ్యే ఫీచర్లు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మోడల్ కేవలం 1000 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటి ఉత్పత్తిని కేవలం 1000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు కాబట్టి ఇవి ఎక్స్‌క్లూజివ్ కార్లుగా నిలుస్తాయి.

ఎతియోస్, లివా కార్లలోని మిడ్-రేంజ్ వేరియంట్ (G)ను ఆధారంగా చేసుకొని ఈ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్లను తయారు చేశారు. ఈ మోడళ్లలో యాంత్రికపరమైన మార్పులు లేవు. ఈ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టొయోటా ఎతియోస్, లివా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్

రెగ్యులర్ వెర్షన్ జి వేరియంట్ ఎతియోస్, లివా కార్లు సింగిల్ కలర్ ఇంటీరియర్‌తో లభ్యమవుతుంటే, ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ వేరియంట్లు మాత్రం డ్యూయెల్ టోన్ కలర్ (క్రీమ్ అండ్ బీజ్) ఆప్షన్‌తో లభ్యం కానున్నాయి.

టొయోటా ఎతియోస్, లివా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్

అన్ని ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ఎతియోస్, లివా కార్ల వెనుకవైపు 'ఎక్స్‌క్లూజివ్' అనే బ్యాడ్జ్ (వేరియంట్ పేరుకు దిగువన) ఉంటుంది.

టొయోటా ఎతియోస్, లివా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్

రిమోట్‌తో కూడిన బ్లూటూత్ ఆడియో సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, మెరుగైన సీట్ ఫ్యాబ్రిక్, క్రోమ్ క్యాప్‌తో కూడిన గేర్ షిఫ్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ఎతియోస్, లివా కార్లలో లభ్యం కానున్నాయి.

టొయోటా ఎతియోస్, లివా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్

ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ఎతియోస్, లివా కార్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Liva Xclusive - Petrol: INR 495,349

Liva Xclusive - Diesel: INR 605,400

Etios Xclusive - Petrol: INR 605,900

Etios Xclusive - Diesel: INR 713,243

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Thursday, September 12, 2013, 9:52 [IST]
English summary
The next festive season special edition car for India has been announced and this time its from Toyota. The Japanese automaker has announced ‘Xclusive Edition' models for the Etios and Liva sedan and hatchback. Only 1000 units of each model will be made, thus qualifying for the ‘Xclusive' tag.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+