అప్‌గ్రేడెడ్ టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ విడుదల
జపనీస్ కార్ కంపెనీ టొయోటా అందిస్తున్న పవర్‌ఫుల్ ప్రీమియం ఎస్‌యూవీ 'ఫార్చ్యూనర్' (Fortuner)లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. తొలుత ఇండోనేషియన్ మార్కెట్లలో విడుదలైన ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2013 టొయోటా ఫార్చ్యూనర్ త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే ఆస్కారం ఉంది.
ఇండోనేషియాలోని టొయోటా అనుబంధ సంస్థ పిటి టొయోటా ఆస్ట్రా మోటార్ ఈ అప్‌డేటెడ్ వెప్షన్ ఫార్చ్యూనర్‌తో పాటు, ఈ ఎస్‌యూవీ కోసం టిఆర్‌డి స్పోర్టివో కిట్‌ను కూడా విడుదల చేసింది. ఇదివరకటి ఫార్చ్యూనర్‌తో పోల్చుకుంటే మరింత కంఫర్ట్‌గా, ప్రీమియం ఫీల్‌ను ఇచ్చేలా కొత్త టొయోటా ఫార్చ్యూనర్‌ను అప్‌గ్రేడ్ చేశారు.
కొత్త 2013 టొయోటా ఫార్చ్యూనర్‌లోని మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవాలంటే ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

రెగ్యులర్ టొయోటా ఫార్చ్యూనర్‌కు కొత్తగా ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను జోడించారు. వీటిని ఫ్రంట్ బంపర్‌లోనే ఫాగ్ ల్యాంప్స్‌కు కొద్దిగా పక్కన అమర్చారు.

రెగ్యులర్ టొయోటా ఫార్చ్యూనర్‌లో క్రోమ్ గ్రిల్ ఉంటే, టిఆర్‌డి స్పోర్టివో వెర్షన్‌కు మాత్రం పూర్తిగా బ్లాక్ కలర్ గ్రిల్‌ను జోడించారు.

అప్‌గ్రేడెడ్ టొయోటా ఫార్చ్యూనర్‌లో కొత్తగా రూఫ్ మౌంటెడ్ డివిడి ప్లేయర్‌తో కూడిన కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు.

రెగ్యులర్ టొయోటా ఫార్చ్యూనర్ అల్లాయ్ వీల్స్, టిఆర్‌డి స్పోర్టివో ఫార్చ్యూనర్ అల్లాయ్ వీల్స్ కూడా వేర్వేరుగా ఉంటాయి.

అయితే, ఇంజన్ పరంగా కొత్త ఫార్చ్యూనర్‌లో ఎలాంటి అప్‌గ్రేడ్స్ లేవు. ఇదవరకటి 2.7 లీటర్ పెట్రోల్, 2.5 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఇందులోను ఉపయోగించారు. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి.

ఇండియాలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) పెట్రోల్ వెర్షన్ ఫార్చ్యూనర్‌ను విక్రయించడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో మరింత శక్తివంతమైన 3.0 లీటర్ ఇంజన్‌ను 4-స్పీడ్ నుంచి 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌కు కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది.

ఇండోనేషియాలో అప్‌గ్రేడెడ్ టొయోటా ఫార్చ్యూనర్ ప్రారంభ ధర 396 మిలియన్ రుపయ్య (మన దేశ కరెన్సీలో సుమారు రూ.4,270)గా ఉంది.

ఇటీవల టొయోటా ఇండోనేషియాలో విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ ఇన్నోవా మాదిరిగా కాకుండా, ఈ అప్‌గ్రేడెడ్ టొయోటా ఫార్చ్యూనర్‌లో చేసిన మార్పులు చేర్పులు నామమాత్రమే అని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications








